ఓపెన్ హైమర్ సినిమా సెట్స్ లో నిజంగా ఆటమ్ బాంబు పేల్చారా? డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ షాకింగ్ ఆన్సర్!

Sambi Reddy | Updated : Jul 18 2023, 12:58 PM IST
Google News Follow Us

మాస్టర్ స్టోరీ టెల్లర్, కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే క్రిస్టోఫర్ నోలన్ నుండి వస్తున్న మరో సినిమా మాయాజాలం ఓపెన్ హైమర్. ఈ క్రేజీ బయోపిక్ సెట్స్ లో రియల్ ఆటమ్ బాంబ్ పేల్చారనే ప్రచారం జరుగుతుండగా దర్శకుడు వివరణ ఇచ్చారు. 
 

17
ఓపెన్ హైమర్ సినిమా సెట్స్ లో నిజంగా ఆటమ్ బాంబు పేల్చారా? డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ షాకింగ్ ఆన్సర్!
Oppenheimer movie

క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తుదంటే వరల్డ్ వైడ్ బజ్ ఉంటుంది. తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లడం నోలన్ ప్రత్యేకత. సైన్స్, లాజిక్ ఫాలో అవుతూ సృజనాత్మకంగా సినిమా తెరకెక్కించడంలో నోలన్ ఘటికుడు. ఆయన స్క్రీన్ ప్లే టెక్నీక్స్, కథలు ప్రపంచవ్యాప్తంగా వందల చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిన బ్లాక్ బస్టర్ గజినీ చిత్రానికి క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మెమెంటో స్ఫూర్తి.

27
Oppenheimer movie

రెండున్నర దశాబ్దాల కెరీర్లో నోలన్ కేవలం 12 చిత్రాలు చేశారు. నోలన్ చిత్రాలు ఒక పట్టాన అర్థం కావు. అంతుచిక్కని లోతులతో కూడిన కథలో క్యారెక్టర్స్ లోని లేయర్స్ తికమక పెడతాయి. ఒక ఫజిల్ లా సాగే కథలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనే భావన కలుగుతుంది. అలా అని విసుగు రాదు.అర్థం చేసుకోవాలనే క్యూరియాసిటీ కలగజేస్తాయి. ఇన్సెప్షన్,  ఇంటర్ స్టెల్లర్ లాంటి చిత్రాలు ఆయన స్క్రీన్ ప్లే స్టాండర్డ్స్ కి నిదర్శనంగా నిలిచాయి. 

37
Oppenheimer movie

నోలన్ లేటెస్ట్ మూవీ ఓపెన్ హైమర్. ఆటమ్ బాంబు సృష్టికర్త జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ. కై బర్డ్, మార్టిన్ జే షెర్విన్ రాసిన అమెరికన్ ప్రొమేతియస్ బుక్ ఆధారంగా తెరకెక్కుతుంది. సిల్లియన్ మర్ఫీ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఓపెన్ హైమర్ జులై 21న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు.

Related Articles

47
Image: Oppenheimer Official New Film Trailer / Youtube

దర్శకుడు నోలన్ తన చిత్రాల్లో సన్నివేశాలు వాస్తవికతకు దగ్గరగా చూపిస్తారు. ది బ్యాట్ మాన్ బిగిన్స్ చిత్రం కోసం ఆయన నిజంగానే ఒక బిల్డింగ్ పేల్చేశారు. అలాగే ది డార్క్ నైట్ రైజెస్ మూవీలో గాల్లో విమానం బద్దలయ్యే సన్నివేశాన్ని రియల్ గా ప్రాణాలకు తెగించి షూట్ చేశారు. ఈ క్రమంలో ఓపెన్ హైమర్ మూవీలో అణుబాంబు పేలితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించడానికి నిజమైన ఆటమ్ బాంబు ఎడారిలో పేల్చి చిత్రీకరించారనే ప్రచారం జరుగుతుంది. 
 

57
Image: Oppenheimer Film Trailer / Youtube

అసలు ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా అణు బాంబు పేల్చే అనుమతి ఉంటుందా? ప్రభుత్వాలు, పర్యావరణ శాస్త్రవేత్తలు చూస్తూ ఊరుకుంటారా? అణుబాంబు పేలుడు విధ్వసం సృష్టిస్తుంది. వాతావరణానికి హాని కలిగిస్తుంది. ఇన్ని అడ్డంకుల మధ్య నోలన్ అణుబాంబు పేలుడుకు పాల్పడ్డాడా? అనే సందేహాలు ఉన్నాయి. 
 

67
Oppenheimer

ఈ ఊహాగానాల మీద నోలన్ స్వయంగా స్పందించారు. జనాలు సినిమా కోసం నేను ఎంతకైనా తెగిస్తాననే ఆలోచనలో ఉన్నారు. ఇది ఒకింత భయపెడుతుంది, అన్నారు. ఆటమ్ బాంబు పేలుడు ఎఫెక్ట్ చూపించడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ సరిపోతాయి. అయితే వాస్తవానికి దగ్గరగా ఉండదు. అలాగే అణుబాంబు పేలుడు వలన జరిగే నష్టం ఎంత దారుణంగా ఉంటుందో ప్రజలను భయపెట్టేదిగా ఉండదు. అందుకే మేము గ్రాఫిక్స్ వాడలేదు, అన్నారు. 
 

77


మరి అణుబాంబు పేలుడు దృశ్యాలు ఎలా చిత్రీకరించారనేది ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. అణుబాంబు కాకున్నప్పటికీ భారీ పేలుడు మాత్రం జరిపారని తెలుస్తుంది. ఓపెన్ హైమర్ చిత్రంలో ఈ అణుబాంబు ఎఫెక్ట్ చెప్పిన విధానం చూడాలనే క్యూరియాసిటీ పెంచింది. ఇక ఇది బయోపిక్ అయినప్పటికీ క్రిస్టోఫర్ నోలన్ తన స్క్రీన్ ప్లే మ్యాజిక్, టెక్నీకల్ స్టాండర్డ్స్, ఎమోషన్స్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచనున్నారనే సమాచారం. 

Recommended Photos