అవార్డుల కోసం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ మధ్య గొడవ.. ఎందులోనూ తగ్గేదెలే అంటున్నారుగా?

First Published | Apr 3, 2022, 9:48 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాతో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కి మంచి పేరు గుర్తింపు వచ్చింది. ఇద్దరు హీరోలకు పాన్‌ ఇండియా ఇమేజ్‌ వచ్చింది. అయితే ఫ్యాన్స్ మధ్య మాత్రం వార్‌ మాత్రం ఆగడం లేదు. ఎవరికి వారు రెచ్చిపోతున్నారు.
 

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం నిర్మాత చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు రూ.470కోట్లతో రూపొందింది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా రన్‌ అవుతుంది. పది రోజుల్లో దాదాపు ఎనిమిది వందల కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. అయితే అన్ని ఖర్చులు పోనూ, షేర్‌ రూపంలో ఈ సినిమా సుమారు రూ.460కోట్లు వచ్చాయని ట్రేడ్‌ వర్గాల సమాచారం. 

ఇదిలా ఉంటే ఇందులో సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ మధ్య వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. హీరోల పాత్ర నిడివి, నటన, సినిమాలో హైలైట్‌ అయ్యే విషయంలోనూ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వార్‌ జరిగింది. మా హీరో బాగా చేశాడంటే, మా హీరో బాగా చేశాడని కామెంట్లతో సోషల్‌ మీడియాని షేక్‌ చేశారు. ఎవరు బెస్ట్ ఎమోషన్స్ పలికించారంటూ ఇప్పటికీ వార్‌ జరుగుతుంది. 
 


ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్‌కి తెరలేసింది. అవార్డుల గొడవ స్టార్ట్ అయ్యింది. ఇందులో ఉత్తమ నటుడిగా మా నటుడికి బెస్ట్ యాక్టింగ్‌ అవార్డు వస్తుందంటే, మా హీరోకి వస్తుందని పోస్ట్ లు పెట్టడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఇద్దరి ఎవరికి నేషనల్‌ అవార్డు వస్తుందని పోల్‌ నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా, ట్రెండ్‌గా మారడమే కాదు హాట్‌ టాపిక్‌ అవుతుంది. అసలు `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా జాతీయ అవార్డు వస్తుందా? అందులోనూ ఈ హీరోలకు అవార్డులు వస్తాయా? అనేది తెలియాలంటే వెయిటింగ్‌ తప్పదు. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం ఈ వార్‌ మాత్రం ఆగడం లేదు. దీనికి ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి. 
 

మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా మూడు వందల కోట్లు వసూలు చేయడం విశేషం. బాలీవుడ్‌లో రెండు వందల కోట్ల వరకు కలెక్ట్ చేయగా, ఓవర్సీస్‌లో రెండు వందల కోట్లు కలెక్షన్లని రాబట్టి రికార్డ్ సృష్టించింది. సౌత్‌లోనూ ఈ సినిమాకి భారీగానే కలెక్షన్లు వస్తుందటం విశేషం. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోగా రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటించగా, అజయ్‌ దేవగన్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

Latest Videos

click me!