Ileana New Plan: అది వర్కౌట్‌ కాకపోవడంతో రూట్‌ మార్చిన పవన్‌ హీరోయిన్‌.. దీంతో ఇల్లీ బేబీకి ఊపొస్తుందా?

Published : Apr 03, 2022, 07:27 PM ISTUpdated : Apr 03, 2022, 07:33 PM IST

పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌ ఇలియానా గత కొంత కాలంగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన క్లోజప్‌ షాట్‌లో హాట్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. వర్కౌట్‌ సెషన్స్‌ వీడియోలతో దుమారం రేపుతుంది. 

PREV
16
Ileana New Plan: అది వర్కౌట్‌ కాకపోవడంతో రూట్‌ మార్చిన పవన్‌ హీరోయిన్‌.. దీంతో ఇల్లీ బేబీకి ఊపొస్తుందా?

`పోకిరి` చిత్రంతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిన ఇలియానా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో `జల్సా` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె హీరోయిన్‌గా మంచి కామెడీ చేయడం విశేషం. బబ్లీగా ఉండే ఇన్నోసెంట్‌ రోల్‌లో అదరగొట్టింది. టాలీవుడ్‌లో ఈ గోవా బ్యూటీ బాగా సెటిల్‌ అయ్యింది. కానీ కొన్ని పొరపాట్ల కారణంగా ఆమె కెరీర్‌ ట్రాక్‌ తప్పింది. 

26

ఆమె ప్రేమలో పడటం, మోసపోవడంతో సినిమా జీవితం ట్రాక్‌ తప్పింది. చాలా గ్యాప్‌ రావడంతో ఈ లోపు ఆడియెన్స్ ఇలియానాని మర్చిపోయారు. పైగా ఆమె అనేక ఆరోగ్యకరమైన ఇబ్బందులను ఎదుర్కొంది. డిప్రెషన్‌, బాడీ షేమింగ్‌ వంటి అనారోగ్య సమస్యలు, అవమానాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో కుంగిపోయిన ఇలియానా నెమ్మదిగా కోలుకుంది. తన తప్పు తెలుసుకుని ఇప్పుడు కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. 

36

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇలియానా ఫామ్‌ కోల్పోయింది. మేకర్స్ సైతం ఇలియానాని మర్చిపోయిన పరిస్థితి కొత్త హీరోయిన్లు దూసుకురావడంతో ఇలియానా ఫేడౌట్‌ అయ్యింది. కానీ అన్ని అడ్డంకులను అధిగమించి మళ్లీ సినీ జీవితంలో సెటిల్‌ కావాలని, పూర్వ వైభవం పొందాల బాగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రెగ్యూలర్‌గా వర్కౌట్స్ చేస్తుంది. తన హాట్‌ హాట్‌ ఫోటోలు, బికినీ పోజులు పంచుకుంటూ అటు మేకర్స్ ని, ఇటు సోషల్‌ మీడియా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

46

అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఒకటి అర సినిమాలు తప్పా ఇలియానాకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడంలో తెలుగు ఆమె కనిపించి నాలుగేళ్లు అవుతుంది. మళ్లీ టాలీవుడ్‌ ఆఫర్‌ రాలేదు. మరోవైపు బాలీవుడ్‌లో కూడా ఒకటి అర తప్ప పెద్దగా లేవు. ప్రస్తుతం ఆమె `అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ`,తోపాటు మరో హిందీ సినిమా చేస్తుంది.

56

మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా అవకాశాలు రాకపోవడంతో రూట్‌ మార్చింది ఇలియానా. ఒరిజిల్‌ ఆల్బమ్‌ సాంగ్‌ చేయడం స్టార్ట్ చేసింది. లేటెస్ట్ గా ఆమె వీడియో సాంగ్‌ చేసింది. గతంలో 2017లో ఓ వీడియో సాంగ్‌లో మెరిసిన ఇలియానా ఇప్పుడు మరో సాంగ్‌ చేసింది. `ఊఊఊ.. `అంటూ సాంగే పాటలో మెరవబోతుంది. ఇందులో కరణ్‌తో కలిసి స్టెప్పులేయబోతుంది ఇలియానా. 

66

తాజాగా ఈ పాట లుక్స్ ని విడుదల చేశారు. ఇందులో ముస్లిం అమ్మాయిలా కనిపిస్తుంది ఇలియానా.  ఏప్రిల్‌ 6న ఈ పాటని విడుదల చేయబోతున్నారు. ఈ పాటని కరణ్‌ ఆలపించగా, కరణ్‌, సిద్ధేష్‌ పటోల్‌ లిరిక్‌ రాశారు. మరి ఈ పాట మంచి ఆదరణ పొంది, ఇలియానాకి పేరుతీసుకొస్తుందేమో చూడాలి.  ఇదిలా ఉంటే ఇలియానా పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించిన `జల్సా` సినిమా శనివారంతో(ఏప్రిల్‌ 2,2008) 14ఏళ్లు పూర్తి చేసుకుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగ్యమతిగా ఇలియానా ఆద్యంతం ఆకట్టుకుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories