వార్ 2 వారం రోజుల వసూళ్లు, లాభాలు రావాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి?

Published : Aug 21, 2025, 11:06 AM IST

భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి.. నిరాశను మిగిల్చింది ఎన్టీఆర్ వార్ 2 సినిమా. బాక్సాఫీస్ దగ్గర కూడా సత్తా చూపించలేక పోతోంది. రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతున్నా.. బ్రేక్ ఈవెన్ కు ఇంకా సగం దూరంలోనే ఉంది.

PREV
16

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2, ఆగస్టు 14న గ్రాండ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా వసూళ్లు రాబడుతోంది. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు.

DID YOU KNOW ?
ఎన్టీఆర్ కోసం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా చూడటానికి జపాన్ నుంచి ఓ మహిళా అభిమాని ఇండియాకు వచ్చింది. థియేటర్ లో తమ అభిమాన హీరో సినిమా చూడాలని ఇక్కడకు వచ్చినట్టు ఆమె అన్నారు.
26

వార్ 2 బడ్జెట్?

వార్2 మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమా కోసం ఎక్కడా తగ్గకుండా బడ్జెట్ ను కేటాయించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అషుతోష్ రాణా, అనిల్ కపూర్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో పాటు టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో మూవీపై ఖర్చు భారీగా పెరిగింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, వార్ 2 బడ్జెట్ సుమారు 400 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

36

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

వార్ (2019) చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మొత్తం 340 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇందులో తెలుగు రైట్స్ ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ 105 కోట్లకు పొందినట్టు సమాచారం. కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా 19 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ద్వారా 56 కోట్లు, నాన్ థియేట్రికల్ ద్వారా మరో 160 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కావాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

46

వార్ 2 వారం రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు

వార్ 2 రిలీజ్ అయ్యి సరిగ్గా వారం రోజులు అవుతోంది. 7 రోజుకు బలమైన వసూళ్లు సాధించిన వార్ 2, వారం మొత్తం కలిపి భారీ వసూళ్లను నమోదు చేసింది. సాక్ నిక్ గణాంకాల ప్రకారం: మొదటి రోజు 52 కోట్లు, రెండోవ రోజు 58 కోట్లు, మూడోవ రోజు 33.25 కోట్లు, నాలుగోవ రోజు 33 కోట్లు, ఐదోవ రోజు 8.75 కోట్లు, ఆరోవ రోజు 9 కోట్లువసూలు చేసిన ఈసినిమా ఏడోవ రోజు 6 కోట్ల కలెక్షన్ మార్క్ ను సాధించింది. ఇలా 7 రోజుల్లో ఇండియా అంతట ఈసినిమా నెట్ కలెక్షన్ దాదాపు 200 కోట్లుకి చేరింది.

56

టోటల్ కలెక్షన్స్  చూసుకుంటే?

ఇక వార్ 2 టోటల్ గా చూసుకుంటే తెలుగు వెర్షన్ 51 కోట్లు, తమిళ వెర్షన్ మూవీ1.5 కోట్లు, హిందీ ఒరిజినల్ వెర్షన్ లో 142 కోట్ల కలెక్షన్స్ ను సాధించినట్టు తెలుస్తోంది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ 250 కోట్లు కాగా, ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ 67 కోట్లుగా నమోదు అయినట్టు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా వార్ 2 గ్రాస్ కలెక్షన్స్ 317 కోట్లు నమోదు అయినట్టు సమాచారం.

66

లాభాల్లోకి రావాలంటే ?

వార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ కోసం అవసరమైన రూ.700 కోట్ల గ్రాస్ వసూళ్లకు ఈ సినిమా ప్రస్తుతం సగం దూరం వచ్చేసింది. ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్ ని చూస్తే, మూడవ వారంలో సినిమా లాభాల్లోకి రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories