`వారణాసి`పై భారీ అంచనాలున్నాయి. ఇండియాలోనే రూపొందుతున్న బిగ్గెస్ట్ సినిమాలో ఇదొకటని చెప్పొచ్చు. ఈ మూవీ ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. సరికొత్త సంచలనంగా అవతరించబోతుందని, ఈ సినిమాతో మహేష్ గ్లోబల్ స్టార్ కాబోతున్నారని టాక్ నడుస్తోంది. మరి ఇంత పెద్ద సినిమా చేసిన తర్వాత మహేష్ ఎవరితో మూవీ చేస్తాడు, నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో అనేది ఆసక్తికరంగా మారింది.
రాజమౌళితో సినిమా అంటే అది పూర్తయ్యేంత వరకు ఎవరూ కొత్త సినిమాని ప్రకటించరు, చేయరు. ఆ తర్వాత వాటి ఫలితాన్ని బట్టి చేస్తుంటారు. ఇప్పటి వరకు ఆయనతో సినిమాలు చేసిన ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా అందరు అలానే చేశారు. కానీ ఇప్పుడు మహేష్ ముందుగానే డిసైడ్ అయ్యాడట. సంచలన దర్శకుడితో సినిమా చేయబోతున్నాడట.