Vishwanath And Sons Twitter Review : సూర్య, మమితా బైజులు నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి భాగం ఫన్, క్లైమాక్స్ ఎమోషనల్ అంటూ ఎక్స్ లో ఆడియన్స్ పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. సూర్య ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా?
సూర్య, మమితా బైజు మ్యాజిక్.. థియేటర్లలో అదరగొడుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్
వర్సటైల్ యాక్టర్ సూర్య, గ్లామరస్ బ్యూటీ మమితా బైజు కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఇక ప్రీమియర్స్, మార్నింగ్ షో చూసిన జనాలు ఎక్స్ (ట్విట్టర్) లో తమ రివ్యూలను షేర్ చేసుకుంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమాకు ఎక్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఫ్యామిలీ డ్రామా, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో వెంకీ అట్లూరి మళ్లీ తన మార్క్ చూపించారని ఆడియన్స్ చెబుతున్నారు.
25
బ్రీజీ అండ్ ఎంజాయబుల్ ఫస్ట్ హాఫ్.. సూర్య నటన నెక్స్ట్ లెవెల్
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా కూల్‌గా, ఫన్‌గా సాగిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిన మొదటి 20 నిమిషాలు కథ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా, ఆ తర్వాత మంచి పేస్ అందుకుంది. హాస్పిటల్ సీక్వెన్స్, ట్రిప్ కామెడీ, హోటల్ ఫైట్ సీన్లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇందులో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య ప్రాణం పోశారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
గజినీలోని సంజయ్ రామస్వామి పాత్ర ఎంత ఐకానిక్‌గా ఉందో, ఈ సంజయ్ విశ్వనాథ్ రోల్ కూడా అంతే రేంజ్‌లో ఉందంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రను సూర్య దాటేసారని కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రాధిక, మమితా బైజు, సూర్య మధ్య ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా నేచురల్‌గా వర్కవుట్ అయ్యాయి. మమితా బైజు లుక్స్ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండి క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని చెబుతున్నారు.
'లక్కీ భాస్కర్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి మళ్లీ బలమైన కథతో వచ్చారని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ పీక్స్‌లో ఉందని రివ్యూస్ వస్తున్నాయి. మన టాలీవుడ్ క్లాసిక్ హిట్స్ అయిన అలా వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ఎమోషన్స్ ఈ సినిమాలో మళ్లీ చూశామని ఆడియన్స్ ఫీలవుతున్నారు. ఆ ఎమోషన్స్‌ను వెంకీ అట్లూరి తనదైన కొత్త ట్రీట్‌మెంట్‌తో చాలా ఫ్రెష్‌గా స్క్రీన్ మీద చూపించారు. ఆయన రాసిన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి.
కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ ప్రొడక్షన్
ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నోచ్‌గా ఉన్నాయని ఎక్స్ యూజర్లు ప్రశంసిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాకు అతిపెద్ద బలం ఇందులో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్. చాలా సన్నివేశాలు హృదయాలను తాకేలా, కళ్ల వెంట నీళ్లు తెప్పించేలా ఉన్నాయని ఆడియన్స్ పోస్ట్లు పెడుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ బ్లాక్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన మోస్ట్ శాటిస్‌ఫైయింగ్ ఎండింగ్స్‌లో ఇదొకటి అని కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది మంచి రేటింగ్ ఇస్తూ, కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లీన్ ఎమోషనల్ డ్రామా అని చెబుతున్నారు.
55
ఒక కాన్సెప్ట్.. ఎమోషనల్ జర్నీ
ఒలింపిక్స్ షూటర్ అయిన హీరో తన బిడ్డకు జన్మనిచ్చిన సర్రోగెట్ మదర్‌తో ఏర్పడే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. పాపకు ఒంట్లో బాగోలేనప్పుడు వారిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. డబ్బింగ్, లిప్ సింక్ విషయంలో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ అని ఆడియన్స్ ఫైనల్ వర్డిక్ట్ ఇస్తున్నారు. సూర్య ఆరా, మమితా బైజు క్యూట్‌నెస్, వెంకీ అట్లూరి ఎమోషన్స్ కలసి ఈ సినిమాను ఈ వారానికి బెస్ట్ ఫ్యామిలీ వాచ్‌గా మార్చేశాయి.