VAS Day 5 Box Office: సూర్య స్లో అయ్యాడు.. అయినా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కి అదిరిపోయే కలెక్షన్లు

Published : Aug 19, 2026, 08:48 AM IST

VAS Day 5 Box Office: సూర్య నటించిన `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఈ మూవీ కొంత స్లో అయినా మంచి వసూళ్లని రాబడుతోంది. బ్రేక్‌ ఈవెన్‌కి దగ్గరలో ఉంది.

PREV
14
వీక్‌ డేస్‌లో విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కి డీసెంట్ కలెక్షన్లు

సూర్య హీరోగా నటించిన `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీ బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా స్లో డౌన్‌ అవుతుంది. వీకెండ్స్ తో పోల్చినప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ వీక్‌ డేస్‌లోనూ ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. స్ట్రాంగ్‌గానే ఉండటం విశేషం. చాలా వరకు సినిమాలు వీక్‌ డేస్‌లో భారీగా పడిపోతాయి. ఈ చిత్రం మాత్రం డీసెంట్‌ గా వసూళ్లని రాబట్టడం విశేషం. ఇది సినిమా విజయానికి కారణమవుతుందని చెప్పొచ్చు.

24
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ 5 రోజుల కలెక్షన్లు

సూర్య, మమితా బైజు జంటగా నటించిన `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` కలెక్షన్లు చూస్తే, ఐదో రోజు ఇండియాలో రూ.7.33కోట్లు రాబట్టింది(సాక్నిల్క్ లెక్కల ప్రకారం). ఓవర్సీస్‌లో మరో రెండు కోట్లు వచ్చాయి. సోమవారంతో పోల్చితే కోటి వరకు తగ్గాయి. కానీ అది పెద్ద మార్పుగా చెప్పలేం. సాధారణంగా బుధ, గురువారం వరకు కలెక్షన్లు తక్కువగానే ఉంటాయి. మళ్లీ శుక్రవారం నుంచి పుంజుకుంటాయి. ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతుందా అనేది చూడాలి. ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.128.60కోట్లు రాబట్టడం విశేషం. ఇండియాలో రూ.83.60కోట్ల గ్రాస్‌, రూ.72.30కోట్ల నెట్‌ వచ్చింది. ఓవర్సీస్‌లో సుమారు రూ.45కోట్లు రావడం విశేషం. ఇది ఓవర్సీస్‌లో దుమ్ములేపుతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్లని రాబడుతుంది. తెలుగులో ఐదో రోజు రూ.3.50కోట్లు రాగా, తమిళంలో రూ.2.35కోట్లు మాత్రమే రావడం గమనార్హం.

34
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్

`విశ్వనాథ్ అండ్‌ సన్స్` సినిమాకి అయిన థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.90కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.22కోట్లుగా నిర్ణయించారు. ఇక్కడ ఈ వీక్‌తో బ్రేక్‌ ఈవెన్‌ అయిపోతుంది. ఇక నాన్‌ థియేట్రికల్‌గా ఈ సినిమాకి ఓటీటీ రూపంలో రూ.85కోట్లు వచ్చాయి. నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. శాటిలైట్‌ రూపంలో మరో రూ.28కోట్లు వచ్చాయి. ఆడియో రూపంలో రూ.12కోట్లు వచ్చాయి. మొత్తంగా బిజినెస్‌ రూ.215కోట్లు అని సమాచారం. సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.130కోట్లు. దీంతో మేకర్స్ ఇప్పటికే రూ.85కోట్ల లాభాల్లో ఉన్నారు. థియేట్రికల్‌ గా సినిమా హిట్‌ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్‌ రావాలి. ఇప్పటి వరకు వచ్చిన లెక్కలతో పోల్చితే ఇంకా రూ.50కోట్లు రావాలి. లాంగ్‌ రన్‌లో అది సాధ్యమే అని చెప్పొచ్చు.

44
హిట్‌ దిశగా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్

అయితే చిత్ర బృందం మాత్రం ఈ సినిమాకి నాలుగు రోజుల్లోనే రూ.150కోట్లు వచ్చినట్టు ప్రకటించింది. మంగళవారం కలెక్షన్లతో ఇది రూ.165కోట్లు దాటుతుంది. దీంతో మరో ఇరవై కోట్లు వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని చెప్పొచ్చు. ఏరకంగా అయినా `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌` హిట్‌ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. రాధికా శరత్‌ కుమార్ అమ్మ పాత్రలో నటించగా, రవీనా టండన్‌ పిన్ని పాత్ర చేసింది. సునీల్‌ రెడ్డి, వైవా హర్ష వంటి వారు ఇతర పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories