VAS 4 Days Collections: వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్ నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్లని రాబట్టింది.
నటుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో దుమ్మురేపుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సూర్య, మమితా బైజు నటనకు మంచి మార్కులు పడ్డాయి. వారి కెమిస్ట్రీనే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 'కరుప్పు' తర్వాత సూర్యకు ఇది మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
24
సూర్య సినిమాకి రికార్డు బుకింగ్స్
'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా టికెట్ల అమ్మకాల్లోనూ కొత్త రికార్డు సృష్టించింది. 'బుక్ మై షో' ప్లాట్‌ఫామ్‌లో గత ఆదివారం ఒక్కరోజే 3,11,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుంది. ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరినే కథ అందించారు. రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్, భవాని శ్రీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సూర్య 46వ చిత్రంగా వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్', బ్లాక్‌బస్టర్ హిట్ 'లక్కీ భాస్కర్' తర్వాత వెంకీ అట్లూరి తీసిన సినిమా.
34
విశ్వనాథ్ అండ్ సన్స్ 4వ రోజు కలెక్షన్లు
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' సోమవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9.50 కోట్లు వసూలు చేసింది. ఇందులో కేవలం భారతదేశంలోనే రూ.7.50 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్‌లో రూ.2 కోట్ల కలెక్షన్లు సాధించింది. నిన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.3.85 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత తమిళనాడులో రూ.3.65 కోట్లు వసూలు చేసింది. అయితే, షోల పరంగా చూస్తే తెలుగులో 1924 షోలు, తమిళంలో 3038 షోలు ప్రదర్శించారు. ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే విశేష ఆదరణ పొందుతోంది.
'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.120.88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ దూకుడు చూస్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళ ప్రేక్షకులతో పోలిస్తే తెలుగు ఆడియన్స్‌నే ఈ సినిమా ఎక్కువగా ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత సూర్య నుంచి వచ్చిన ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'విశ్వనాథ్ అండ్ సన్స్' నిలిచింది. ఈ సినిమా సూర్య గత చిత్రం 'కరుప్పు' రికార్డును బద్దలు కొడుతుందో లేదో చూడాలి.