Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

Published : Sep 06, 2026, 10:00 AM IST

Vishwanath and Sons: సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా థియేటర్లలో మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది.

PREV
15
విశ్వనాథ్ అండ్ సన్స్ వసూళ్లు
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఆగస్టు 14, 2026న థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ చిత్రంలో సూర్యతో పాటు మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, భవాని శ్రీ ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
25
ఆగస్టు 30 నాటికి సూర్య సినిమా వసూళ్లు.
ఈ సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసిందని వార్తలొచ్చాయి. థియేటర్లలో సినిమాకు వస్తున్న ఆదరణతో కలెక్షన్లు మరింత పెరిగాయి. ఈ క్రమంలో, ఆగస్టు 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
35
ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్, కామెడీ కలగలిపిన కథ
వెంకీ అట్లూరి 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాకు కథ రాసి, దర్శకత్వం వహించారు. ఆయన గత చిత్రం 'లక్కీ భాస్కర్' విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో, సూర్య-వెంకీ అట్లూరి కాంబోపై మొదటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్, కామెడీ కలగలిపిన కథ అని ఫస్ట్ లుక్, ట్రైలర్లు స్పష్టం చేశాయి.
45
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం
ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల బృందం కూడా అద్భుతంగా ఉంది. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షించారు. సూర్య 46వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి రూపొందించబడింది.
55
టాక్సిక్ ప్రభవం కూడా లేదు..

ప్రస్తుత సమాచారం ప్రకారం, ఆగస్టు 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇది ఆ తేదీ నాటి కలెక్షన్ మాత్రమే, ఫైనల్ ఫిగర్ కాదు. సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతున్నందున, రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈమధ్యలో టాక్సిక్ లాంటి పెద్ద సినిమా వచ్చినా.. సూర్య సినిమాకు ఇబ్బంది కలిగించలేదు.. టాక్సిక్ టాక్ తో మళ్లీ సూర్య సినిమా తమిళంలో పుంజుకున్నట్టు తెలుస్తోంది. ఇంతలో, ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని కూడా వార్తలు వస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories