Latest Videos

జూ.ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీని రీమేక్ చేస్తానంటున్న విశ్వక్ సేన్.. ఎందుకో తెలుసా..

First Published May 23, 2024, 8:15 PM IST

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. విశ్వక్ సేన్ తనదైన పంథాలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు.

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. విశ్వక్ సేన్ తనదైన పంథాలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. విశ్వక్ సేన్ నుంచి త్వరలో రాబోతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 

మే 31న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. విశ్వక్ సేన్ కి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మంచి బాండింగ్ ఉంది. ప్రతి వేదికపై విశ్వక్ సేన్ తారక్ పై అభిమానాన్ని చాటుకుంటుంటారు. 

తాజాగా ఇంటర్వ్యూలో మరోసారి విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సినిమాల్లో ఏదైనా మూవీ రీమేక్ చేయాలని ఉందా అని యాంకర్ సుమ ప్రశ్నించింది. దీనితో విశ్వక్ సేన్ వెంటనే నా అల్లుడు చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. 

ఆ మూవీ బావుంటుంది. రీమేక్ చేయాల్సి వస్తే ఆ సినిమా చేస్తా. ఆ చిత్రంలో కొన్ని విషయాల్ని సరి చేసి రీమేక్ చేస్తే మంచి హిట్ అవుతుంది అని విశ్వక్ సేన్ తెలిపాడు. 

2005లో వర ముళ్ళపూడి దర్శకత్వంలో వచ్చిన నా అల్లుడు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రంలో జెనీలియా, శ్రీయ హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ ఎన్టీఆర్ అత్త పాత్రలో నటించింది. 

ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్ల రొమాన్స్.. అత్తతో కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. ఫలితంగా మూవీ డిజాస్టర్ అయింది. ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్ మాత్రం మెప్పించింది. 

click me!