చంద్రకాంత్ మరణించడానికి కారణం అదే.. నాక్కూడా అలాంటి సిచ్యువేషన్, నరేష్ సంచలన వ్యాఖ్యలు

First Published May 23, 2024, 4:27 PM IST

త్రినయని టివి సీరియల్ నటిగా గుర్తింపు పొందిన పవిత్ర జయరామ్.. అస్మాతుగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆ భాద భరించలేక ఆమెతో సహజీవనం చేస్తున్న చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

సీనియర్ నటుడు నరేష్ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. ఆయన ఏం మాట్లాడినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నరేష్ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు హీరోగా రాణించిన నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. మరోవైపు ఆయన పర్సనల్ లైఫ్ కూడా వార్తల్లో నిలుస్తోంది. 

నటి పవిత్రతో నరేష్ రిలేషన్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. నరేష్, పవిత్ర ప్రస్తుతం కలిసి జీవిస్తున్నారు. ఇటీవల జరిగిన చంద్రకాంత్, పవిత్ర జయరామ్ ల విషాదకర సంఘటన ఛాయలు ఇంకా పోలేదు. నటుడు చంద్రకాంత్, పవిత్ర జయరాం క్లోజ్ రిలేషన్ లో ఉన్నారు. 

Pavithra Jayaram

త్రినయని టివి సీరియల్ నటిగా గుర్తింపు పొందిన పవిత్ర జయరామ్.. అస్మాతుగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆ భాద భరించలేక ఆమెతో సహజీవనం చేస్తున్న చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చిత్ర పరిశ్రమలో పెను విషాదాన్ని సృష్టించింది. 

Pavitra Jayaram

ఈ సంఘటనపై నటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన ఆత్మీయులు మనల్ని సడెన్ గా విడిచి వెళ్ళిపోతే భరించలేని బాధ కలుగుతుంది. ఆ సమయంలో ఓదార్చేవారు ధైర్యం చెప్పేవారు పక్కనే ఉండాలి. నేను కూడా అలాంటి సంఘటన ఎదుర్కొన్నా. 

మా అమ్మ విజయనిర్మల మరణించినప్పుడు నాకు అంతా శూన్యం అనిపించింది. ఆ సమయంలో నేను, కృష్ణ గారు ఎంతో బాధ అనుభవించాం. కానీ ఒకరినొకరం ఓదార్చుకున్నాం అని నరేష్ అన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఎంత బాధాకర సంఘటన జరిగిన ఒకరికొకరు తోడుండేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 

నటి పవిత్ర జయరాం మరణించడంతో తాను ఒంటరి అయిపోయినట్లు చంద్రకాంత్ కుమిలిపోయాడు. అదే అతడిని ఆత్మహత్య వైపు ఉసిగొల్పి ఉంటుంది అని నరేష్ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు పక్కనే ఉండిఉంటే బావుండేది అని నరేష్ అన్నారు. 

click me!