గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ రివ్యూ: విశ్వక్ సేన్ కష్టపడ్డాడు కానీ, సినిమాలో అదే మైనస్ అట!

First Published | May 31, 2024, 8:52 AM IST


విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్స్ లోకి వచ్చేసింది. ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం షాక్ ఇచ్చేలా ఉంది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫలితం తేల్చేశారు. 

Gangs of Godavari Review

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ విడుదల ఒకటి రెండు సార్లు వాయిదా పడింది. గత ఏడాదే ఈ చిత్రం థియేటర్స్ లోకి రావాల్సింది. విశ్వక్ సేన్ ఎంత ప్రయత్నం చేసినా కుదర్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతో మంచి హైప్ దక్కింది. 

Gangs of Godavari Review

హీరోయిన్ అంజలిని బాలకృష్ణ వేదిక మీద తోసేయడం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. ఈ పరిమాణం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం గురించి మాట్లాడుకునేలా చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ సైతం ఆకట్టుకోగా ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. పోటీగా విడుదలైన గం గం గణేశా, భజే వాయువేగం కంటే... గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసమే ఆడియన్స్ ఎదురుచూశారు. 


Gangs of Godavari Review

తెల్లవారుజామున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. మూవీ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. దాంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టాక్ బయటకు వచ్చింది. 

Gangs of Godavari Review

మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంచనాలు అందుకోవడంలో విఫలం చెందింది. దర్శకుడు కృష్ణ చైతన్య పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆరంభం బాగుంది. సెటప్ కుదిరింది. ఆ టెంపో ని దర్శకుడు ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. 

Gangs of Godavari Review

ప్రధాన పాత్రల మధ్య డ్రామా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బోరింగ్ గా సాగుతుంది. క్లైమాక్స్ ఏమాత్రం ఆకట్టుకోదు. విశ్వక్ సేన్ నటన, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మెప్పించే అంశాలు. అంజలి పాత్రకు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదంటున్నారు. నేహా శెట్టి మాత్రం పర్లేదనే వాదన వినిపిస్తోంది. 

Gangs of Godavari Review

పట్టులేని కథనం ప్రేక్షకుడికి థ్రిల్ ఇవ్వలేదని ఆడియన్స్ ఫీలింగ్. విశ్వక్ సేన్ రా అండ్ రస్టిక్ రోల్ లో జీవించే ప్రయత్నం చేశాడు. పాత్ర కోసం ఆయన పడిన కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడనే వాదన వినిపిస్తోంది. యువన్ శంకర్ రాజా బీజీఎమ్ కి పాజిటివ్ మార్క్స్ పడుతున్నాయి.
 
 

విశ్వక్ సేన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అనిపిస్తుంది. పెద్దగా పోటీ లేదు. ప్రభాస్ కల్కి విడుదలయ్యే వరకు వసూళ్లు దున్నేసుకోవచ్చు. మరి నెగిటివ్ టాక్ నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.గం గం గణేశా, భజే వాయు వేగం చిత్రాల టాక్ పై ఇది ఆధారపడి ఉంటుంది.. 

Latest Videos

click me!