`కల్కి2898 ఏడీ` యానిమేషన్‌ సిరీస్‌ ఎపిసోడ్‌ 1 రివ్యూ.. బుజ్జి, భైరవ పరిచయం ఎలా ఉందంటే?

First Published | May 31, 2024, 8:46 AM IST

ప్రభాస్ నటిస్తున్న `కల్కి2898ఏడీ` యానిమేషన్‌ సిరీస్‌లోని మొదటి ఎపిసోడ్‌ విడుదలైంది. మరి ఇది ఎలా ఉంది? ఇందులో ఏం చూపించారనేది చూస్తే.. 
 

ప్రభాస్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కల్కి2898ఏడీ`. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో అమితా్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్‌ హాసన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఆయన పాత్ర పరిధి తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తుంది. దీన్ని ఓ యూనివర్స్ గా తీసుకొస్తున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. సుమారు ఐదు పార్ట్ లుగా రూపొందించే అవకాశం ఉందట. ప్రస్తుతానికి రెండు పార్ట్ లుగా విడుదల చేయబోతున్నారు. మొదటి పార్ట్ జూన్‌ 27న రిలీజ్‌ కానుంది. 

మహాభారతంలోని ఎలిమెంట్లకి, భవిష్యత్‌ కాలానికి ముడిపెడుతూ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌గా నాగ్‌ అశ్విన్‌ దీన్ని రూపొందిస్తున్నారు. 2898ఏడీ అనే భవిష్యత్‌ కాలానికి సంబంధించిన సైన్స్ ఫిక్షన్‌ అంశాల నుంచి 6వేల సంవత్సరాల వెనక్కి వెళ్లి మైథాలజి అంశాలను ముడిపెడుతూ ఈ మూవీని రూపొందించారట. మరి ఈ రెండింటికి ఎలా లింక్‌ కుదిరిందనేది పెద్ద సస్పెన్స్. ఆ సస్పెన్స్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు టీమ్‌. అందుకోసం యానిమేషన్‌ రూపంలో ఈ మూవీని తీసుకొచ్చారు. ఆడియెన్స్ కి అర్థం కావడం కోసం ముందుగానే దాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. 
 

Latest Videos


అందులో భాగంగా `కల్కి2898ఏడీ` యానిమేషన్‌ సిరీస్‌ మొదటి ఎపిసోడ్‌ని ఓటీటీ(అమెజాన్‌ ప్రైమ్‌)లో గురువారం రాత్రి విడుదల చేశారు. ప్రీలాడ్‌ పేరుతో దీన్ని రిలీజ్‌ చేశారు. ఇందులో ప్రభాస్‌ నటిస్తున్న భైరవ పాత్రని, అలాగే యంత్రం బుజ్జిని పరిచయం చేశారు. ఒక యంత్రం ఆకాశంలో విహరిస్తూ అత్యంత విలువైన వస్తువులతో వెళ్తుంటుంది. అందులో బుజ్జి ఉంటుంది. ఓ కొత్త ప్రదేశం గుండా వీరి యంత్రం వెళ్తుంటే, ఆ దారిలో వద్దు బందిపోట్లు ఉంటారని చెప్పినా తమ సిబ్బంది వినరు. చెప్పినట్టే అందులోని విలువైన వస్తువుల కోసం బందిపోట్లు దాడి చేసి నాశనం చేస్తారు. అందులో నుంచి ఫైనాపిల్స్ ఎత్తకుపోతారు. 
 

ఆ యంత్రం స్క్రాప్‌ని మొత్తం డంప్‌ యార్డ్ కి తరలించగా, అందులో బుజ్జి ఉండిపోతుంది. మరోవైపు ఓ ఫ్యూచరిస్టిక్‌ ప్రపంచంలో ఓ వీధిలో భైరవ ఉంటాడు. ఓ వ్యక్తి రక్షించమని ఆ కాలనీకి రాగా, భైరవ తగులుతాడు. తనకు యూనిట్స్ ఇస్తే కాపాడతా అని చెబుతాడు. దీంతో తమ కాలనీలో ఉండే వ్యక్తులతోనే ఫైట్‌ చేస్తాడు. అయితే అతను ఇచ్చే యూనిట్స్ కంటే అతన్ని పట్టుకుంటే వేల యూనిట్స్ వస్తాయని చెప్పడంతో అతన్ని పట్టుకునేందుకు బయలుదేరతాడు భైరవ. అక్కడ ఓ కొత్త బైక్‌ భైరవని ఆకర్షిస్తుంటుంది. దాన్ని ఎలాగైనా కొనాలనేది భైరవ కోరిక. అందుకోసం సరిపడా యూనిట్స్ సంపాదించే పనిలో ఉంటాడు. ఎవరు ఏ పని చెప్పినా చేస్తుంటాడు. 
 

ఆ వ్యక్తిని పట్టుకుంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయని తెలిసి ఇక తన కాలనీలోనే ఉండే ఓ వృద్ధుడి (అమితాబ్‌ పాత్రని తలపించేలా ఉంది)రిక్షా తీసుకుంటాడు. అది చాలా పాతది. దానిపై అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా కొంత దూరం వెళ్లాక అది మొత్తం డ్యామేజ్‌ అవుతుంది. దాన్ని పాత ఇనుప సామాను యార్డ్ కి తీసుకెళ్లి అమ్మేయాలనుకుంటాడు. అప్పుడే ఆ డంప్‌ స్క్రాప్‌లో నుంచి బుజ్జి శబ్దం వినిపిస్తుంది. డ్యామేజ్‌ పరికరాలను అమ్మడం కంటే దాని ద్వారా యంత్రం తయారు చేయడం బెటర్‌ అని భైరవకి చెబుతుంది బుజ్జి. ఆ స్క్రాప్‌లో ఉన్న బుజ్జిని తీసుకుని దానితో మాట్లాడుతూ ఆకాశం వైపు చూస్తాడు భైరవ. అప్పుడే సూర్యుడు భగభగమండుతూ ఉదయిస్తుంటాడు. అంతటితోనే ఎపిసోడ్‌ అయిపోయింది. 
 

14 నిమిషాల నిడివి గల ఈ `కల్కి2898ఏడీ` యానిమేషన్‌ `బుజ్జి అండ్‌ భైరవ` ఎపిసోడ్‌ 1` కల్కి కథని, ఈరెండు పాత్రలను పరిచయం చేసింది. సినిమా ఎలా ఉండబోతుంది, బ్యాక్‌ డ్రాప్‌ ఏంటి? అనేది ఆడియెన్స్ కి అవగాహన కల్పించేలా ఉంది. ఇందులో భైరవ పాత్ర, ఆయన వాడే భాష కాస్త ఫన్నీగా, సరదాగా ఉంది. సైన్స్ ఫిక్షన్‌ అంటే ఎలా ఉంటుందో, ఏముంటుందో అనే అనుమానాలున్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ, రెగ్యూలర్‌ సినిమా స్టయిల్‌లోనే ఇందులో పాత్రలు, లాంగ్వేజ్‌ ఉండటం విశేషం.
 

 అయితే ఇంగ్లీష్‌ పదాలు ఎక్కువగా ఉన్నాయి. అవి కొంత అర్థం కావడం కష్టం, కానీ సినిమాగా ఇది రెగ్యూలర్‌ తెలుగు సినిమాలను తలపించే ఫ్లేవర్‌తోనే ఉండటం విశేషం. ఆ కాలం, ఆ ప్రపంచం వేరు, మిగిలినదంతా సేమ్‌ టూ సేమ్‌ అనేలానే ఉంది. ఆహా, ఆహో అనేలా అయితే లేదనిపిస్తుంది. సినిమా అనేది అందరికి అర్థం కావడం ముఖ్యం. ఆ ప్రయత్నమే ఈ యానిమేషన్‌ సిరీస్‌ ద్వారా చేశారు. ఇందులో బ్రహ్మానందం పాత్ర కూడా ఉండటం విశేషం. ముసలోడా అంటూ బ్రహ్మీని భైరవ పిలవడం, నాకు అందరు ముసలోల్లే తగులుతున్నారని అనడం కామెడీగా ఉంది. 
 

బ్రహ్మీ, భైరవ పాత్రల మధ్య జరిగే కన్వర్జేషన్‌ ఆకట్టుకుంది. ఫన్నీగా ఉంది. రెంట్ కట్టనందుకు బ్రహ్మీ ఇంటినుంచి భైరవని తోసేసినట్టుగా చూపించారు. ఇంటి హోనర్‌గా బ్రహ్మీ కనిపించడం విశేషం. ఈ ఇద్దరి కాంబో నవ్వులు పూయిస్తుందనిపిస్తుంది. అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్‌ పాత్రలని, ఆ కాలాన్ని అర్థం చేసుకోవడానికే పరిమితమయ్యింది. వాహ్‌ అనేలా ఉందని చెప్పలేం. చెప్పేలా కూడా లేదు. మరో ఎపిసోడ్‌ వస్తేనేగానీ ఎలా ఉందనేది ఓ క్లారిటీ వస్తుంది. సినిమా రిలీజ్‌కి ముందు రెండు ఎపిసోడ్లని విడుదల చేయాలనుకుంటుంది టీమ్‌. 
 

click me!