గం గం గణేశా ట్విట్టర్ రివ్యూ: ఆనంద్ దేవరకొండ చిత్రానికి ఊహించని రెస్పాన్స్! హిట్టా పట్టా?

First Published | May 31, 2024, 7:21 AM IST


ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ గం గం గణేశా. దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించాడు. మే 31న గ్రాండ్  గా విడుదల చేశారు. ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్  సినిమా ఎలా ఉందో తెలియజేస్తున్నారు. 
 

Gam Gam Ganesha Review


ఈ సమ్మర్ చప్పగా సాగింది. ఎలక్షన్స్, ఐపీఎల్ కారణంగా బడా చిత్రాలేవీ విడుదల కాలేదు. ఈ పరిణామం చిన్న హీరోలకు కలిసొచ్చింది. థియేటర్స్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ప్రతి శుక్రవారం నాలుగైదు స్మాల్ బడ్జెట్, డబ్బింగ్ చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఈ వారం ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ భజే వాయువేగం, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా చిత్రాలు విడుదలయ్యాయి. 

Gam Gam Ganesha Review

గం గం గణేశా చిత్రానికి హైప్ దక్కింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన రష్మిక మందాన చేసిన కొన్ని క్రేజీ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాగే బేబీ మూవీతో హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ నుండి వస్తున్న నెక్స్ట్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలు గం గం గణేశా మూవీ అందుకుందా. 


Gam Gam Ganesha Review

ఆనంద్ దేవరకొండ గత చిత్రాలకు భిన్నమైన సబ్జెక్టు ఎంచుకున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఆయన గతంలో చేసింది లేదు. గం గం గణేశా ఈ జోనర్లో దర్శకుడు తెరకెక్కించాడు. ఆనంద్ దేవరకొండ కు జంటగా ప్రగతి శ్రీవాత్సవ నటించారు. జబర్దస్త్ ఇమ్మానియేల్, వెన్నెల కిషోర్, బిగ్ బాస్ ప్రిన్స్ యావర్, సత్యం రాజేష్ ఇతర కీలక రోల్స్ చేశారు. 

Gam Gam Ganesha Review

ఇక ఆడియన్స్ అభిప్రాయంలో గం గం గణేశా బాగానే ఉందట. కథలో కొత్తదనం లేకపోయినా పరుగులు పెట్టించే స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఆసక్తికరంగా నడిపారని అంటున్నారు. సినిమా ప్రారంభంలో నెమ్మదించినా ప్రీ ఇంటర్వెల్ కి ఊపందుకుంటుంది. కామెడీ పండింది అంటున్నారు. 

Gam Gam Ganesha Review


ముఖ్యంగా సిట్యుయేషనల్ కామెడీ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ ఎపిసోడ్స్ సైతం నవ్వులు పూయించిందని అంటున్నారు. హీరోయిన్ తో ఆనంద్ దేవరకొండ లవ్ ట్రాక్ కి మైనస్ మార్క్స్ వేస్తున్నారు. దొంగ పాత్రలో ఆనంద్ దేవరకొండ మెప్పించాడట. ఫుల్ లెన్త్ రోల్ దక్కించుకున్న ఇమ్మానియేల్ పాత్రకు న్యాయం చేశాడు అంటున్నారు. 

మ్యూజిక్ పర్లేదు, నిర్మాణ విలువలు బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగుందనేది సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయం. ఈ సమ్మర్ కి కూల్ గా ఒకసారి గం గం గణేశా చిత్రం చూడొచ్చని అంటున్నారు. మొత్తంగా గం గం గణేశా చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. 
 

Latest Videos

click me!