యువతలో మాస్ కా దాస్ గా గుర్తింపు సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ విశ్వక్ సేన్ కి గుర్తింపు తెచ్చిపెట్టింది. విశ్వక్ సేన్ నటించిన ఫలక్ నుమా దాస్, హిట్, అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రాలు పర్వాలేదనిపించాయి. ఇప్పుడు విశ్వక్ సేన్ మరో ప్రయత్నంతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.