ఆమె ఒక్కతే ఇక్కడ పుణ్యశ్రీ, ఆమెదీ ఒక పర్సనాలిటీ, విష్ణుప్రియా సంచలన వ్యాఖ్యలు, నాగ్‌ రియాక్షన్‌ ఏంటంటే?

First Published | Sep 7, 2024, 7:45 PM IST

విష్ణు ప్రియా చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యింది. సోనియాని పట్టుకుని ఆమె ఒక్కతే పుణ్యశ్రీ అంటూ ఎగతాళి చేసింది. ఆమె బాడీపై కూడా షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ఇదే పెద్ద రచ్చ కాబోతుంది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ప్రారంభమై వారం రోజులవుతుంది. 14 మందితో ఎనిమిదవ సీజన్‌ బిగ్‌ బాస్‌ సెప్టెంబర్‌ 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు తొలి వీకెండ్‌ వచ్చింది. ఈ వారం రోజులు హౌజ్‌లో ఏం జరిగింది? ఎవరెవరు ఎలా ఆడారో, ఎవరు ఏమేం తప్పులు చేశారో తెలిపేందుకు, ఓవరాల్‌ రివ్యూ చేస్తూ హౌజ్‌ మేట్స్ లో జోష్‌ నింపేందుకు హోస్ట్ నాగార్జున వస్తున్నారు.

శనివారం, ఆదివారం హోస్ట్ వచ్చి హౌజ్‌మేట్లతో గేమ్‌ ఆడిస్తారనే విషయం తెలిసిందే. అదే సమయంలో ఒకరి ఎలిమినేషన్‌ కూడా ఉంటుంది. ప్రస్తుతం నామినేషన్‌లో బేబక్క, శేఖర్‌ బాషా, నాగమణికంఠ, పృథ్వీరాజ్‌, విష్ణు ప్రియా, సోనియా ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం మైక్రో సైట్‌ ని వీక్షించండి.
 

ఫస్ట్ వీక్‌లో ఎలిమినేషన్‌ అనేది చాలా వరకు ఉండదు. ప్రత్యేక కారణాలతో, హౌజ్‌లోకి వచ్చిన తొలి వారమే అనే కారణంతో వదిలేస్తుంటారు. మరి ఈ సారి కూడా అలానే చేస్తారా? ఈ సారి అంతా డిఫరెంట్‌గా సాగుతున్న నేపథ్యంలో ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా డిఫరెంట్‌గానే చేస్తారా?

ఊహించని విధంగా ఒకరిని ఎలిమినేట్‌ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం మేరకు ఏషియానెట్‌ పోలింగ్‌, ఇతర పోలింగ్స్ ప్రకారం బేబక్క బాటమ్‌లో ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. 
 


ఇదిలా ఉంటే ఇక తాజాగా బిగ్‌ బాస్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో వచ్చింది. నాగ్‌ వీకెండ్‌ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సారి మరో ట్విస్ట్ ఇచ్చారు. హౌజ్‌లో వారం మొత్తం ఎవరు ఎలా ఆడారో, ఏం చేశారో నాగ్‌ మొదట చెబుతుంటారు. కానీ ఈ సారి అలా కాదు, ఇతర హౌజ్‌మేట్స్ తోనూ రివ్యూ చేయించారు.

వారి చేతనే ముందు జడ్జ్ మెంట్ ఇప్పించారు. ఒకరిపై ఒకరి అభిప్రాయాలు, ఎవరు ఏం మిస్టేక్‌ చేశారో చెప్పాలని తెలిపారు. చివర్లో తన అభిప్రాయం ఉంటుందన్నారు. ఈక్రమంలో శేఖర్‌ బాషా.. మణికంఠ గురించి విమర్శ చేశారు. 
 

అనంతరం విష్ణు ప్రియా.. సోనియా ఆకులని టార్గెట్‌ చేసింది. తాను కొన్ని సార్లు కోపంలో వాడే పదాలు చాలా హర్టింగ్‌గా ఉంటాయని తెలిపింది. ఈ సందర్బంగా గతంలో జరిగిన విషయాన్ని చూపించారు నాగ్‌. అసలేం జరిగిందో అందరికి తెలిసేలా చేశారు.

ఇందులో విష్ణుప్రియా.. ఒక యాంకర్ గా మారి.. సోనియాని మీకు ముందు నిఖిల్‌ నచ్చలేదు, ఇప్పుడు బాగా క్లోజ్‌ అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు ? కారణం ఏంటని అడగ్గా నేను చెప్పను పో అంటూ వెళ్లిపోయింది సోనియా.

నేను అడగమనలేదని సీత వివరణ ఇవ్వగా, ఎవరు అడగమన్నా, ఎవరు అడిగినా? ఇలాంటి చెత్త కామెడీని నేను ఎంకరేజ్‌ చేయను అంటూ ఫైర్‌ అయ్యింది సోనియా. అలాంటి ట్యాగ్‌ ఇవ్వడం కరెక్ట్ కాదని విష్ణు ప్రియా చెప్పింది. 
 

నువ్వు కాజ్వల్‌గా అడిగావు, సోనియాకి అది అలా అనిపించలేదని నాగ్‌ చెప్పారు. అనంతరం విష్ణు ప్రియా, సోనియా మధ్య ఇంకా జరిగిన కన్వర్జేషన్‌ చూపించారు. నేను ఎలాంటి అడల్ట్రీ జోకులు వేయలేదని చెప్పింది విష్ణు ప్రియా. మీరిద్దరు ఇలా ఇలా చేసుకుంటున్నారని, మీ ఇద్దరి మధ్య ఏదైనా నడుస్తుందని నేను అడగలేదని చేతులు సైగలు చేస్తూ విష్ణు ప్రియా అడగడం షాకిచ్చింది.

ఇది తట్టుకోలేని సోనియా ఫైర్‌ అవుతూ వెళ్లిపోయింది. దీనికి విష్ణు ప్రియా రియాక్ట్ అవుతూ, ఆమె ఒక్కతే అరిస్తే ఇంకా ఎవరూ అరవరనుకుంటుంది? ఆమెదీ ఒక పర్సనాలిటీ.. ఎగతాళిగా అనుకుంటూ వెళ్లిపోయింది విష్ణు ప్రియా. దీనికి తట్టుకోలేని సోనియా కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెని అభయ్‌ ఓదార్చాడు. 
 

ఆ తర్వాత మళ్లీ వచ్చిన విష్ణుప్రియా.. నేనూ ఏడుస్తా అభయ్‌ అన్నా, నన్ను అన్నారు. ఆమె ఒక్కతే పుణ్య శ్రీ.. మేమిక్కడ అలాంటి వాళ్లమా? అంటూ వెళ్లిపోయింది. దీంతో సోనియా మరింతగా ఏడ్చింది. అక్కడ ఉన్న వాళ్లంతా షాక్‌ అయ్యారు. దీనిపై నాగార్జున విష్ణు ప్రియాని నిలదీశాడు.

నేనూ బాధపడ్డాను సర్‌, నేను ఏడవనంత మాత్రాన అనబోతుండగా, బాధపడితే గుచ్చుతావా ఆ అమ్మాయిని అని నిలదీశాడు నాగ్‌. నువ్వు కూడా లేడీనే కదా, నీవు అర్థం చేసుకోవాలి కదా. మరోవైపు సోనియాని అడిగాడు.. ఆ గుప్పిడి పట్టుకుని ఉన్నావేంటి? కోపమొచ్చిందా? అని నాగ్‌ అడగ్గా, ఈ మూమెంట్‌లో బాధేసిందని చెప్పింది.

అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయవు, అందరి ఎమోషన్స్ ఒకేలా ఉండవు అని నాగ్‌ చెప్పడంతో కాస్త కూల్‌ అయినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ విషయం మాత్రం బయట విష్ణుప్రియాకి బాగా డ్యామేజ్‌ చేసేలా ఉంది. దీన్ని ఆడియెన్స్ ఎలా తీసుకుంటారు? అనేది ఈ రాత్రి ఎపిసోడ్‌ని బట్టి తెలుస్తుంది. కానీ ఇది శనివారం ఎపిసోడ్‌లో చాలా హీటెక్కించే విషయమనే చెప్పాలి.  
 

Latest Videos

click me!