ఈ షోలో ఓ టాస్క్ ఇచ్చింది సుమ. పెళ్లి అనగానే ఏం గుర్తొస్తాయో చెప్పాల్సి ఉంటుంది. ఇందులో విష్ణు ప్రియా `షాపింగ్, బంధువులు అని, ధన్‌రాజ్.. శుభలేఖలు, కళ్యాణ మండపం, బంగారం అని చెప్పొకొచ్చాడు. ఇంతలో విష్ణు ప్రియా రియాక్ట్ అవుతూ `శోభనం` అని చెప్పేసింది. దీంతో నవ్వులు విరిసాయి. కానీ అది రాంగ్ ఆన్సర్ అయ్యింది. దీనికి దర్శకుడు వేణు రియాక్ట్ అవుతూ శోభనం గుర్తొచ్చింది కానీ, తాళిబొట్టు గుర్తుకు రాలేదని సెటైర్ వేయడంతో షో మొత్తం దద్దరిల్లింది. విష్ణు ప్రియా మొఖం వాడిపోయింది.