చీరకట్టులో మెరిసిపోతున్న ‘డీజే టిల్లు’ హీరోయిన్.. మత్తు పోజులతో మెస్మరైజ్ చేస్తున్న నేహా శెట్టి

First Published | May 23, 2023, 1:37 PM IST

గ్లామర్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) సోషల్ మీడియాలో తన బ్యూటీఫుల్ లుక్స్ తో దర్శనమిస్తూ ఆకట్టుుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోల్లో చాలా అందంగా ఉంది.
 

అవుట్ అండ్ కామెడీ, రొమాంటిక్ ఫిల్మ్ ‘డీజే టిల్లు’ సినిమాతో యంగ్ బ్యూటీ నేహా శెట్టికి మంచి గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. దీంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తన పెర్ఫామెన్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 
 

‘డీజే టిల్లు’  తర్వాత నేహా కేరీర్ చాలా స్పీడ్ అవుతుందని భావించినా అలా కనిపించడం లేదు. కానీ మునుపటి లాగే ఆఫర్లను దక్కించుకుంటోంది. తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమైంది.
 


ఇదిలా ఉంటే నేహా శెట్టి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్న క్రమంలో వరుసగా పోస్టులు పెడుతూ ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

లేటెస్ట్ పిక్స్ లో నేహా శెట్టి సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది.  చీరకట్టులో రాధిక అందాల మెరుపులు మెరిపించింది. తన బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. కుర్ర భామ ఫోజులతోనూ కుర్రాళ్ల చూపును తిప్పుకోకుండా చేస్తోంది. బ్యూటీఫుల్ గా నవ్వుతూ, మత్తుగా చూస్తూ మెస్మరైజ్ చేసింది. 
 

ప్రస్తుతం నేహా పంచుకున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. నేహా అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

ప్రస్తుతం నేహా శెట్టి రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతోంది. ఆర్ఎక్స్100 హీరో కార్తీకేయ సరసన ‘బెదురులంక2012’, అలాగే కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’లోనూ నటిస్తోంది. త్వరలో ఈ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.
 

Latest Videos

click me!