Sudheer-Vishnu Priya: సుడిగాలి సుధీర్‌కి విష్ణుప్రియ మ్యారేజ్‌ ప్రపోజల్‌, స్టార్‌ కమెడియన్‌ రియాక్షన్‌ ఇదే

Published : Apr 15, 2026, 12:46 PM IST

సుడిగాలి సుధీర్‌, రష్మి జంటకి ఒకప్పుడు మంచి క్రేజ్‌ ఉండేది. కానీ ఇప్పుడు రష్మి స్థానంలో విష్ణు ప్రియ వచ్చింది. అయితే తాజాగా ఆమె సుధీర్‌ని పెళ్లి చేసుకుంటావా? అని అడిగేసింది. 

PREV
14
మళ్లీ బుల్లితెరని ఊపేస్తున్న సుడిగాలి సుధీర్‌

సుడిగాలి సుధీర్‌ బుల్లితెర స్టార్‌ కమెడియన్‌గా రాణిస్తున్నారు. అదే సమయంలో బిగ్‌ స్రీన్‌పై హీరోగానూ మెప్పిస్తున్నాడు. ఆయన త్వరలో `గోట్‌` మూవీతో రాబోతున్నాడు. అయితే హీరోగా కెరీర్‌ స్ట్రగులింగ్ లో ఉంది. కొన్ని సినిమాలు ఆగిపోవడంతో ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై ఫోకస్‌ పెట్టాడు సుధీర్‌. మెయిన్‌గా `సర్కార్‌` షోని హోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆరో సీజన్‌ నడుస్తోంది. ఇందులో బుల్లితెర సెలబ్రిటీలు, సినిమా ఆర్టిస్ట్ లు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. వాళ్లతో సుధీర్‌ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది.

24
యాంకర్‌ రష్మితో సుడిగాలి సుధీర్‌ కెమిస్ట్రీ పీక్‌

సుడిగాలి ఆ మధ్య ఈ షోలోనే పెళ్లికి ఎందుకు దూరంగా ఉన్నాడో తెలిపారు. ఇన్నాళ్లు ఎందుకు మ్యారేజ్‌ చేసుకోలేదో వెల్లడించారు. తన బ్రేకప్‌ లవ్‌ స్టోరీని బయటపెట్టాడు. అయితే జబర్దస్త్ కి వచ్చాక స్టార్‌ కమెడియన్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో యాంకర్‌ రష్మితో పులిహోర కలుపుతూ మరింత పాపులర్‌ అయ్యాడు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అది షో టీఆర్‌పీ రేటింగ్‌ని తీసుకురావడానికి హెల్ప్ అయ్యింది. అయితే వీరిద్దరు మూడేళ్ల క్రితమే విడిపోయారు. జబర్దస్త్ షో నుంచి సుధీర్‌ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరి మధ్య గ్యాప్‌ వచ్చింది. కానీ ఎప్పుడు రష్మి ప్రస్తావన వచ్చినా సుధీర్‌ మెలికలు తిరుగుతుంటాడు, అలానే రష్మి సైతం సిగ్గుపడుతుంటుంది. అది కేవలం స్క్రీన్‌ కోసమే చేసినా, ఇంకా వీరి మధ్య రిలేషన్‌ ఉందనేది అంతా నమ్ముతున్నారు.

34
సుధీర్‌కి విష్ణు ప్రియ మ్యారేజ్‌ ప్రపోజల్‌

ఈ క్రమంలో సుధీర్‌ కి షాక్‌ ఇచ్చింది విష్ణు ప్రియ. ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. `సర్కార్‌` షోకి రఘు మాస్టర్‌, ప్రణవి జంట, అలాగే యష్‌ మాస్టర్‌, వర్ష వచ్చారు. ఈ రెండు జంటలు `సర్కార్‌ 6` షోలో సందడి చేశారు. ఈ జంటలను, వారి మధ్య కెమిస్ట్రీని చూసిన విష్ణు ప్రియ తట్టుకోలేక స్టేజ్‌ మీదనే అడిగేసింది. `నాకైతే వీళ్లని చూస్తుంటే అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, సుధీర్‌ ఏమంటావ్‌` అని ఓపెన్‌గా అడిగింది విష్ణుప్రియ. దెబ్బకి సుధీర్‌ షాక్‌ అయ్యాడు. దీనికి ఆయన ఇచ్చిన రియాక్షన్‌ అదిరిపోయింది. దెబ్బకి `ప్యాకప్‌` అని చెప్పడంతో షోలో నవ్వులు విరిశాయి.

44
రాత్రి అయినా నాకు ఓకే

ఆ తర్వాత రఘు మాస్టర్‌ కోసం ప్రణవి పాట పాడగా, అనంతరం నువ్వు కూడా నాకు ఒక పాటని డెడికేట్‌ చేయమని చెప్పింది విష్ణు ప్రియ. దీనికి సుధీర్‌ రియాక్ట్ అవుతూ, `రాత్రి అయినా నాకు ఓకే` అనే పాట పాడటంతో ఆమె ఖంగుతిన్నది. షోలో కామెడీ పండింది. అయితే రఘు మాస్టర్‌, యష్‌ మాస్టర్‌ తమ ఫ్యామిలీ లైఫ్‌ గురించి చెప్పారు. ఇంట్లో భార్యలతో ఎలాంటి పరిస్థితిని ఫేస్‌ చేయాల్సి వస్తుందనేది వెల్లడించారు. దీంతో ఇది తనకు హర్రర్‌ సినిమా చూస్తున్నట్టుగా ఉందని సుధీర్‌ చెప్పడం విశేషం. తనకు ఈ పెళ్లి లైఫ్‌ వద్దు అని, నిజంగా మగాళ్లు, మీరు మగాళ్లురా అంటూ కామెంట్‌ చేయడం విశేషం. తాజాగా విడుదలైన ఈ `సర్కార్‌ 6` లేటెస్ట్ ప్రోమో వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడు రష్మి, సుధీర్‌ జోడీ కంటే విష్ణు ప్రియ, సుధీర్‌ జోడికి ఎక్కువ రెస్పాన్స్ వస్తుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories