చిరంజీవి, ఎన్టీఆర్, బన్నీ అందరికీ భారీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్..రెమ్యునరేషన్ లేదు, వందల కోట్ల ఎక్కడివి

Published : Apr 15, 2026, 12:19 PM IST

డైరెక్టర్ వివి వినాయక్ తన ఆస్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కొన్ని సినిమాలకు కనీసం రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు అని అన్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
టాలీవుడ్ మాస్ డైరెక్టర్స్

టాలీవుడ్ లో ప్రతి తరంలో కొందరు మాస్ ఆడియన్స్ ని ప్రభావితం చేసే డైరెక్టర్స్ వస్తుంటారు. వారిలో వివి వినాయక్ ఒకరు. మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించే సినిమాలు చేశారాయన. వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, బాలకృష్ణ, రవితేజ, రాంచరణ్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు నటించారు. చాలా మంది స్టార్లకు వినాయక్ అదిరిపోయే హిట్లు ఇచ్చారు.

25
వందల కోట్ల ఆస్తులు

ఇండస్ట్రీలో వినాయక్ గురించి ఒక టాక్ ఉంది. తాను సంపాదించిన డబ్బుని దుబారా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడ్డారు అని.. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి వందల కోట్లు సంపాదించారు అని అంటుంటారు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా వినాయక్ బదులిచ్చారు. మీరు బాగా రిచ్, వందల కోట్ల ఆస్తులు ఉన్నాయట కదా అని ప్రశ్నించగా.. రిచ్ నిజమే, కానీ వందల కోట్ల ఆస్తులు అనేది ప్రచారం మాత్రమే.

35
రెమ్యునరేషన్ తీసుకోలేదు

మా ఫ్యామిలీ ముందు నుంచి రిచ్ గానే ఉంది. నేను 17 సినిమాలు చేశాను. 17 సినిమాలకే వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించగలను. మొదట్లో చేసిన సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోలేదు. మరికొన్ని చిత్రాలకు చాలా తక్కువ రెమ్యునరేషన్. స్టార్ డైరెక్టర్ అయ్యాక కూడా అఖిల్ లాంటి సినిమాకు తీసుకున్న పారితోషికం వెనక్కి ఇచ్చేశా అని వివి వినాయక్ అన్నారు.

45
కొన్ని తప్పులు చేశా

ఆస్తి విషయంలో నేను కూడా కొన్ని తప్పులు చేశా. కార్లు అంటే నాకు చాలా ఇష్టం. కార్లు, ఇతర వస్తువులు కొనడం కోసం ఆస్తులు కూడా అమ్మేశా. ఇదంతా నాకు ఓవరాక్షన్ అనిపిస్తుంది. లగ్జరీ కార్లు, లగ్జరీ హౌస్ ల కోసం ఉన్న ఆస్తిని అమ్మేస్తుంటారు అని వివి వినాయక్ అన్నారు.

55
రాజమండ్రిలో స్థలం

ఒక లగ్జరీ కారు కొనాలి అని ఆశ పుట్టింది. కానీ అప్పు, ఈఎంఐ అంటే నాకు భయం. ఆ టైంలో మాకు రాజమండ్రిలో ఒక స్థలం ఉండేది. దానిని అమ్మేసి మరీ లగ్జరీ కారు కొన్నాను. ఆ స్థలంలోనే ఇప్పుడు డి మార్ట్ కట్టారు. ఆ ల్యాండ్ వాల్యూ కోట్లల్లో పెరిగిపోయింది ఇప్పుడు అని వినాయక్ గుర్తు చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories