లేడీ ఆర్టిస్ట్ లు అందంగా ఉంటే చాలు ఏఎన్నార్‌ పెట్టే కండీషన్‌ ఇదే, తనతో ఆ పాత్రలు చేయనిచ్చేవాడు కాదా?

First Published Oct 16, 2024, 9:49 AM IST

అక్కినేని నాగేశ్వరరావు అందంపై ఎక్కువ దృష్టి ఉండేదట. అయితే అందమైన లేడీ ఆర్టిస్టులు ఉంటే ఆ పాత్రలు చేయనిచ్చేవాడు కాదట. ఆయన కండీషన్స్ పెట్టేవాడట. 
 

ఏఎన్నార్‌(అక్కినేని నాగేశ్వరరావు) తెలుగు సినిమాకి రెండు కళ్లలో ఓ కన్నుగా భావిస్తుంటారు. ఎన్టీఆర్ కి దీటుగా సినిమాలు చేసి మెప్పించారు. అలుపెరగని బాటసారిలా సాగిపోయారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆయన సినిమాల్లోనే ఉండటం విశేషం. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌, క్లాసిక్స్ చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి మల్టీస్టారర్‌ చిత్రాలు చేశారు. ఓ రకంగా మల్టీస్టారర్‌ ట్రెండ్‌ అప్పుడే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇమేజ్‌తో పనిలేకుండా పాత్ర నచ్చితే ఏ హీరోతోనైనా సినిమాలు చేసేవారు. అయితే తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడట ఏఎన్నార్‌. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అక్కినేనికి అందంపై దృష్టి ఎక్కువ అట. తన గ్లామర్‌ ఏమాత్రం తగ్గకుండా చూసుకునేవాడట. అంతేకాదు తనతో కలిసి నటించే లేడీ ఆర్టిస్టుల విషయంలోనూ ఆ కేర్‌ తీసుకునేవాడట. అయితే అందంగా ఎవరైనా క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉన్నారంటే ఓ రూల్‌ పెట్టేవాడట. ఆ కండీషన్‌ని అంతా ఫాలో కావాల్సిందే. మరి ఏఎన్నార్‌ పెట్టిన కండీషన్‌ ఏంటి? అందమైన క్యారెక్టర్‌ ఆర్టిస్టు ల విషయంలో ఆయన చేసే పనేంటి? అనేది చూస్తే, 
 

Latest Videos


మదర్‌ పాత్రలకు, అత్త పాత్రలకు అందమైన క్యారెక్టర్‌ ఆర్టిస్టులను పెట్టనిచ్చేవాడు కాదట ఏఎన్నారు. తనకు తెలియకుండా పెట్టినా వెంటనే తొలగించేమనేవాడట. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు అందంగా ఉంటే మరదలుగానో, వదినగానో, అక్కగానో, చెల్లి పాత్రలకు పరిమితం చేసేవాడట.

అమ్మగా అందమైన ఆర్టిస్టులు చేస్తే తనని డామినేట్‌ చేస్తారనో, తాను వాళ్ల ముందు తగ్గిపోతాననో తెలియదు కానీ అమ్మ పాత్రలను చేయనిచ్చేవారు కాదని సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ వెల్లడించింది. ఇలాంటి విషయాల్లో ఏఎన్నార్‌ చాలా స్టిక్ట్ గా ఉండేవాడని, వామ్మో ఆయన లెక్క వేరే అని వెల్లడించింది అన్నపూర్ణమ్మ. ఓపెన్‌ హార్ట్ విత్ ఆర్కే షోలో తెలిపింది. 
 

ఏఎన్నార్‌పై అందం మీద ఫోకస్‌ ఎక్కువ అని, అదే ఎన్టీఆర్‌ అవన్నీ పట్టించుకోడని, ఎవరు ఏ పాత్ర చేసినా ఆయనకు ఫర్వాలేదని, ఎందుకంటే ఆయన వెండితెరపై మ్యాజిక్‌ చేస్తారని కాబట్టి మిగిలిన పాత్రలు ఎవరు చేసినా పెద్దగా సమస్య ఉండదని, అదే ఏఎన్నార్‌ విషయంలో అలా ఉండదని, కచ్చితంగా ఈవన్నీ చూసుకుంటాడని తెలిపారు అన్నపూర్ణమ్మ. ఆమె కొన్నేళ్ల క్రితం చెప్పిన ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. అందరిని ఆకట్టుకుంటుంది.
 

అక్కినేని నాగేశ్వరరావు తన ఏడు దశాబ్దాల సినీ జీవితంలో 255కిపైగా సినిమాలు చేశారు. ఇందులో అన్ని రకాల సినిమాలున్నాయి. పౌరాణికాలు, జనపదాలు, సాంఘీకాలు, హిస్టారిక్‌ మూవీస్‌, ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్‌ మూవీస్‌ కూడా ఉన్నాయి. తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ సినిమాలు చేయడం విశేషం. హీరోగానే కాదు నిర్మాతగానూ రాణించారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అనేక సినిమాలు నిర్మించారు. అలాగే అన్నపూర్ణ స్టూడియో స్థాపించారు. తెలుగులోనే ఇది టాప్‌ మోస్ట్ స్టూడియోగా ఉండటం విశేషం. ఇక ఏఎన్నార్‌ కాన్సర్‌తో 2013లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన చివరగా `మనం` సినిమాలో మెరిశారు. ఇందులో అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటించడం విశేషం. 
 

read more: బిగ్‌ బాస్‌ చరిత్రలోనే ఫస్ట్ టైమ్‌, నబీల్‌, మోహబూబ్‌ కమ్యూనిటీ ఓట్ల ప్రస్తావన, ఆడియెన్స్ డిమాండ్‌ ఇదే!

Also read: #Akhanda2: మరోసారి బాలయ్య, బోయపాటి కాంబో.. ఈసారి పూనకాలు తెప్పించే టైటిల్‌

click me!