బాహుబలి 2 కట్టప్ప ట్విస్ట్ వల్ల హిట్ కాలేదు..ఆ ఒక్క సీన్ వల్లే, రాఘవేంద్రరావుకి నచ్చిన సన్నివేశం అదే

First Published | Oct 16, 2024, 11:11 AM IST

టాలీవుడ్ లో రాఘవేంద్ర రావు కొన్ని దశాబ్దాల పాటు దర్శకేంద్రుడిగా రాణించారు. ఆయన టచ్ చేయని జోనర్ అంటూ లేదు. జానపద చిత్రాలు, ఫాంటసీ చిత్రాలు, ప్రేమకథలు,హీరోయిజం ఉన్న సోషల్ డ్రామాలు ఇలా అన్ని జోనర్స్ లో రాఘవేంద్ర రావు సినిమాలు చేసి మెప్పించారు.

టాలీవుడ్ లో రాఘవేంద్ర రావు కొన్ని దశాబ్దాల పాటు దర్శకేంద్రుడిగా రాణించారు. ఆయన టచ్ చేయని జోనర్ అంటూ లేదు. జానపద చిత్రాలు, ఫాంటసీ చిత్రాలు, ప్రేమకథలు,హీరోయిజం ఉన్న సోషల్ డ్రామాలు ఇలా అన్ని జోనర్స్ లో రాఘవేంద్ర రావు సినిమాలు చేసి మెప్పించారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ 1 డైరెక్టర్ గా వెలుగు వెలుగుతున్న రాజమౌళి కూడా రాఘవేంద్ర రావు శిష్యుడే. 

బాహుబలి చిత్రంతో రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో ప్రశంసలు దక్కించుకున్నారు. రెండు భాగాలని సూపర్ సక్సెస్ చేసి తన సత్తా నిరూపించుకున్నారు. అయితే బాహుబలి 2 ఒక ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అంత పెద్ద హిట్ కావడానికి కారణం కట్టప్ప ట్విస్ట్.. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అనేది కారణం అని అంతా అనుకుంటారు అంటూ రాఘవేంద్ర రావు తెలిపారు. కానీ అసలు వాస్తవం అది కాదు. 


తనదైన శైలిలో బాహుబలి చిత్రంలో కొన్ని విషయాలని ఆయన రివీల్ చేశారు. ఆ కారణాల వల్లే బాహుబలి 2 అంత పెద్ద హిట్ అయింది అని పేర్కొన్నారు. బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించడం వెనుక రాజమౌళి ధైర్యం ఉంది. పార్ట్ 2 ని ఆడియన్స్ అంత పెద్ద హిట్ అందుకు చేశారో ఇప్పుడు చెబుతాను.  కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. అదే ప్రధాన అంశం అని అంతా అనుకుంటారు. కానీ అది కాదు. చాలా ప్రశ్నలకు సమాధానం 2 వ పార్ట్ లో ఉన్నలు రాజమౌళి ఫస్ట్ పార్ట్ లోనే హింట్స్ ఇచ్చారు. డైరెక్టర్ గా రాజమౌళి స్క్రీన్ ప్లే విషయంలో  100 పర్సెంట్ బెస్ట్ ఇచ్చారు. 

ఫస్ట్ పార్ట్ లో మొట్టమొదటి సన్నివేశంలో శివగామిని చూపించారు. చంకలో బిడ్డని ఎత్తుకుని ఉంటుంది.స్లోగా ఆ మీ వీపు వెనుక బాణం గుచ్చుకుని ఉన్నట్లు చూపించారు. సో.. కథ మొత్తం ఆమె చుట్టూనే ఉంటుందని అర్థం అయింది. శివగామికి బాణం ఎందుకు గుచ్చుకుందో అనేదానికి సమాధానాలు సెకండ్ పార్ట్ లో ఉంటాయి. ఫస్ట్ పార్ట్ చివర్లో బాహుబలికి పట్టాభిషేకం జరుగుతుంది అని శివగామి ప్రకటిస్తుంది. దీనితో బాహుబలి పట్టాభిషేకంతో సెకండ్ పార్ట్ మొదలవుతుంది అని ఆడియన్స్ అంతా భావించారు. అక్కడే రాజమౌళి మరోసారి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చూపించారు. 

ఆడియన్స్ అనుకున్నదానికి విరుద్ధంగా బాహుబలి పాత్రని ఎలివేట్ చేస్తూ రథం సన్నివేశాన్ని పెట్టారు. అదే బాహుబలి ఎంట్రీ సీన్. కొంతమంది క్రిటిక్స్ విమర్శించవచ్చు.. ఒక మనిషి ఒక్కడే అంత పెద్ద రథాన్ని లాగడం ఏంటి, ఏనుగుని ఢీ కొట్టడం ఏంటి అని.. కానీ ఫాంటసీ చిత్రాల్లో ఉన్న అడ్వాంటేజ్ అదే. ఆ అడ్వాంటేజ్ ని రాజమౌళి తీసుకుని బాహుబలి హీరోయిజాన్ని మరోసారి గుర్తు చేశారు. బాహుబలి కండబలానికి దైవబలం తోడైతే ఏమైనా చేయవచ్చు అని చెప్పడమే రాజమౌళి ఉద్దేశం. మొదటి భాగంలో బాహుబలి ఒక్కడే శివలింగాన్ని ఎత్తినట్లు చూపించారు అని రాఘవేంద్ర రావు గుర్తు చేశారు. 

బాహుబలి 2లో నాకు బాగా నచ్చిన షాట్ ఒకటి ఉంది. శివగామి సరిగ్గా రథం కింద పట్టేలా చూపించారు అది ఒక హైలైట్ అయితే.. రథం మీద వినాయకుడు ఉన్నట్లు ఏనుగు లేచి నమస్కరించే వరకు ఎవ్వరికీ తెలియదు. రాజమౌళి చేసిన అద్భుతం అది అని రాఘవేంద్ర రావు ప్రశంసలు కురిపించారు. ఏ షాట్ ఎప్పుడు రివీల్ చేయాలనేది రాజమౌళికి చాలా బాగా తెలుసు అని రాఘవేంద్ర రావు అన్నారు. అక్కడ రాజమౌళికి తాను 100 శతాం మార్కులు వేస్తాను అని తెలిపారు. 

Latest Videos

click me!