విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అని మీకు తెలుసా..? ఎవరామె..?

Published : Jan 21, 2025, 07:10 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని బంధుత్వాలు  అనుకోకుండా.. అనూహ్యంగా భయటపడుతుంటాయి. అవునా నిజమా అనుకునే విధంగా అవి ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ , ఓ హీరోయిన్ కు సబంధించిన రిలేషన్ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తోంది.   

PREV
16
విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అని మీకు తెలుసా..? ఎవరామె..?


సినిమా ఇండస్ట్రీ, పాలిటిక్స్, క్రికెట్ .. ఈమూడు రంగాలకు విడదీయలేన బంధం ఉంది. ఈ రంగరాలలో స్టార్స్ ఒకరికొకరు ఏదో ఒక రకంగా బంధుత్వాలు కలిగి ఉన్నారు. అందులో కొన్ని బయటకు రానివి.. ఎవరికి తెలియనివి కూడా చాలా ఉన్నాయి. ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ..  భార్య అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని అందరికి తెలిసిందే. ఇలానే ప్లేయర్స్ ను చేసుకున్నవారు చాలామంది ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ మాత్రమే కాదు.. మరో స్టార్ హీరోయిన్ తో కూడా బంధుత్వం ఉంది అని మీకు తెలుసా..?   
 

26

ఇంతకీ ఎవరా హీరోయిన్..? విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ లో స్టార్. సచిన్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అంత ఇమేజ్ ఉన్న ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఆయన భార్య హీరోయిన్ అనుష్క శర్మ. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట.. 2017 లో చాలా గ్రాండ్ గా పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోలైన సల్మాన్, షారుఖ్ లాంటి వారితో సినిమాలు చేసిన అనుష్క శర్మ.. విరాట్ తో పెళ్ళి తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. 

36

ఫ్యామిలీ, పిల్లలు అవే లోకంగా గడిపేస్తోంది అనుష్క శర్మ. ఇక ఈ విషయం పక్కన పెడితే.. విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ మాత్రమే కాదు మరో హీరోయిన్ తో కూడా బంధుత్వం ఉందట. విరాట్ మరదలు ఓ స్టార్ హీరోయిన్ అని  చాలామందికి తెలియదు. అంతే కాదు ఆమె టాలీవుడ్ లో కూడా చాలా సిమాలు చేసిందని తెలుసా..? ఇంతకీ ఎవరా హీరోయిన్.  

46

 ఆమె ఎవరో కాదు రుహానీ శర్మ. విరాట్ కోహ్లీకి మరదలు వరుస అయ్యే ఈ బ్యూటీ ముందుగా తమిళ చిత్రపరిశ్రమలో నటిగా పరిచయం అయ్యింది. కోలీవుడ్ లో తన సినీప్రయాణం స్టార్ట్ చేసిన రుహానీ.. ఆ తర్వాత చి..ల.. సౌ మూవీతో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  తన నటనతో ఆకట్టుకుంది  ఈ బ్యూటీ.. స్టార్ డమ్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. 

56

తెలుగులో వరుసగా  ఆఫర్స్  మాత్రం సాధించింది.  హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక గతేడాది విక్టరీ వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాలోనూ నటించింది.తెలుగులో వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటివరకు స్టార్ స్టేటస్ రాలేదు.. అలా అడపా దడపా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న ఈ బ్యూటీ.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరదలు అవుతుందట. అనుష్క శర్మకు రుహానీ కజిన్ అవుతుందట. 
 

66

ఈ విషయాన్ని ఎప్పుడు ఆమె బయటపెట్టలేదు. కాని సైంధవ్ ప్రమోషన్స్ లో మాత్రం ఈ విషయం వెల్లడించింది రుహాని. తన భావ తనతో చాలా సరదాగా ఉంటాడని.. ఇద్దరు కలిసినప్పుడు ఆటపట్టించుకుంటామని కూడా ఆమె అన్నారు.  దాంతో ఈ విషయం తెగ వైరల్ అయ్యింది. సినిమాలు తక్కువే అయినా..సోజల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది రుహాని శర్మ. మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories