బిగ్ బాస్ హౌస్లో మహేష్ బాబు పోకిరి మూవీకి మించిన ట్విస్ట్, ప్రేక్షకులు షాక్!

First Published | Sep 5, 2024, 7:49 AM IST

బిగ్ బాస్ హౌస్లో కమర్షియల్ మూవీకి మించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ కంటెస్టెంట్ చేసిన పనికి ప్రేక్షకులు షాక్ అయ్యారు. 
 

Bigg Boss Telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. మొదటి వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్విరాజ్, సోనియా ఆకుల నామినేటైన కంటెస్టెంట్స్. వీరిలో ఒకరు వచ్చే ఆదివారం ఇంటిని వీడనున్నారు. 

విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ. కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. స్టార్ మా ఛానల్ సీరియల్ బ్యాచ్ పృథ్విరాజ్ సైతం కొన్ని వారాల హామీతోనే హౌస్లో అడుగుపెట్టి ఉంటాడు. కాబట్టి పృథ్విరాజ్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ కాకపోవచ్చు. శేఖర్ బాషాకు సైతం బుల్లితెర ప్రేక్షకుల్లో కొంత ఫేమ్ ఉంది. 
 

ఇక పోతే... సోనియా ఆకుల, నాగ మణికంఠ, బేబక్క డేంజర్ జోన్లో ఉన్నారు. బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. బేబక్క వయసులో పెద్దవారు. ఆమె గట్టిగా మాట్లాడడం లేదు. అలాగే వయసు పైబడిన లేడీ కంటెస్టెంట్స్ కి పెద్దగా మైలేజ్ ఉండదు. వీలైనంత త్వరగా పంపించేస్తారు. గతంలో పలువురు లేడీ కంటెస్టెంట్స్ విషయంలో ఇది రుజువైంది. 


అయితే సోషల్ మీడియాలో బేబక్కకు సపోర్ట్ బాగుంది. ఆమె గేమ్ పట్ల ఆడియన్స్ లో అనుకూలత ఉంది. కాగా సోనియా ఆకుల, నాగ మణికంఠ ఎక్కువగా ట్రోల్ అవుతున్నారు. సోనియా ఆకుల తనను తాను ఆడపులి గా ప్రకటించుకుంది. ఆమె ఓవరాక్షన్ ఎక్కువైందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మెజారిటీ ఆడియన్స్ ఆమె గేమ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇక నాగ మణికంఠ పదే పదే బరస్ట్ అవుతున్నాడు. కనీళ్ళు పెట్టుకుంటూ తన విషాద నేపథ్యం తెరపైకి తెస్తున్నాడు. ఈ క్రమంలో సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 

నామినేషన్స్ అనంతరం సైతం నాగ మణికంఠ కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇంతకంటే ట్రాన్సపరెంట్ ఉండలేను బిగ్ బాస్. నా జీవితం అయిపోయిందంటూ..  తన విగ్గును తొలగించాడు. ఈ పరిణామంతో ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 

Bigg boss telugu 8

పోకిరి సినిమాకు మించిన ట్విస్ట్ ఇది. నాగ మణికంఠ జుట్టు విగ్ అని అసలు ఊహించలేదు. ఇది అనుకోని మలుపు, అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నాడు. మరికొందరు ఆడియన్స్.. నాగ మణికంఠ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అతన్ని బయటకు పంపేయండి. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళను ఎందుకు షోకి తీస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Bigg Boss Telugu 8

నామినేషన్స్ లో నాగ మణికంఠ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు. ఎమోషనల్ అయ్యాడు. నా బాల్యంలోనే కన్న తండ్రి మరణించాడు. తల్లి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. సవతి తండ్రి వలన ఎన్నో కష్టాలు పడ్డాను. అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది. తల్లి శవాన్ని దహనం చేయడానికి కట్టెలు కొనే స్తోమత లేక డబ్బుల కోసం అడుక్కున్నాను... అంటూ నాగ మణికంఠ కన్నీరు పెట్టుకున్నాడు. నాగ మణికంఠ మాటలకు  తోటి కంటెస్టెంట్స్ సైతం ఎమోషనల్ అయ్యారు. 
 

Bigg boss telugu 8

నాగ మణికంఠ కామెంట్స్ పై ఆయన స్టెప్ సిస్టర్ స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేసింది. అమ్మ మరణం తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనేది మణికంఠ సొంత నిర్ణయం. నాన్న మాత్రం ఎప్పుడూ సపోర్టివ్ గా ఉన్నారు. నాగ మణికంఠ మాటల వెనుక ఆంతర్యం కూడా నాన్న చెడ్డవాడు అని కాదు. 

తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ప్రతి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. మా కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని, ఎవరూ నెగిటివ్ కామెంట్స్ చేయకండి. దయచేసి మా అన్నయ్యకు సపోర్ట్ చేయండి. మణికంఠ టైటిల్ విన్నర్ అయ్యేందుకు సహకరించండి.. అని నాగ మణికంఠ చెల్లెలు కావ్య అమర్ నాథ్ రాసుకొచ్చింది. మరి నాగ మణికంఠ హౌస్లో ఈ మేరకు సత్తా చాటుతాడో చూడాలి... 

Latest Videos

click me!