అయ్యో విజయ్‌ దేవరకొండకి ఏమైంది? అప్పుడు గాయాలు, ఇప్పుడు మెట్లపై జారిపడ్డ రౌడీ బాయ్‌

First Published | Nov 8, 2024, 9:21 PM IST

విజయ్‌ దేవరకొండ వరుసగా గాయాలవుతున్నాయి. ఇప్పటికే గాయంతో బాధపడుతున్న ఆయన ఇప్పుడు మెట్లపై జారిపడటం హాట్ టాపిక్‌ అవుతుంది. ఈ వీడియో వైరల్‌ అవుతుంది.
 

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఇప్పుడు వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన కొత్త సినిమా లుక్‌ పరంగా ఓ చర్చ నడుస్తుంటే, ఆయన గాయాలపాలవుతున్నాడనే మరో వార్త వైరల్‌ అవుతుంది. దీంతోపాటు ఆయన వీడియో సాంగ్‌ ఆల్బమ్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇవన్నీ కాదని ఎదురవుతున్న కొన్ని అవమానాల విషయంలోనూ వైరల్‌గా మారుతున్నాడు. ఇటీవల ఆయన గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మెట్లపై జారిపడి వైరల్‌గా మారాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

విజయ్‌ దేవరకొండ ముంబయిలో మెట్లపై జారిపడ్డాడు. తాజాగా ఆయన `సాహిబా` అనే వీడియో సాంగ్‌ ఆల్బమ్‌లో నటించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గానే దీన్ని ప్రకటించారు. ఇందులో  రాధిక మదన్‌తో ఆయన స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఈ సాంగ్‌ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్‌ దేవరకొండ శుక్రవారం ముంబయిలో సందడి చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన బయటకు వస్తుండగా మెట్లపై నుంచి జారి పడ్డారు. వెంటనే స్పందించిన టీమ్‌ ఆయన్ని పైకి లేపారు. కానీ బలంగానే దెబ్బతగిలినట్టు విజయ్‌ మూమెంట్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. అయితే దాన్నుంచి తేరుకుని నార్మల్‌గానే ఆయన తన కారు వద్దకు వచ్చారు. కాకపోతే కాస్త డల్‌గానే కనిపిస్తున్నారు విజయ్‌. 
 


దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇటీవలే విజయ్‌ గాయపడ్డారు. `వీడీ12` షూటింగ్‌లోనే ఆయన భుజానికి గాయమైందట. అయినా దాన్ని లెక్క చేయకుండా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుగుతుంది. ఈ మూవీలో విజయ్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది. అంతేకాదు ఇటీవల టీమ్‌ విడుదల చేసిన లుక్‌ కూడా గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటే బాక్సాఫీసు షేక్ కావడం పక్కా. విజయ్‌ రెండు మూడు వందల కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

ఇదిలా ఉంటే విజయ్‌కి గాయలు అనే వార్తలు ఫ్యాన్స్ ని ఆందోళనకి గురి చేస్తున్నాయి. విజయ్‌కే ఇలా అవుతుందేంటని ఆయన ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. అంతేకాదు లేటెస్ట్ వీడియో కొంత పరువు తీసేలా కూడా ఉంది. ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్‌కి చాలా క్రేజ్‌ ఉంది. ఆయనంటే పడిచచ్చే లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. అంతగా ఇష్టపడుతున్న విజయ్‌ ని ఇలా చూసి వారంతా ఆందోళన చెబుతున్నారని చెప్పొచ్చు. అయితే ఇందులో విజయ్‌ చాలా అలిసిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ప్రెస్‌ మీట్‌తోపాటు ఆయన నడుస్తూ వస్తున్నప్పుడు కూడా డల్‌గానే ఉన్నారు. వర్క్ ప్రెజర్‌ వల్ల బాగా అలసిపోయి ఉంటాడని సమాచారం. ఏదేమైనా అమ్మాయిల క్రష్‌ విజయ్‌ కి ఇలా కావడం విచారకరం. కానీ ప్రస్తుతం విజయ్‌ బాగానే ఉన్నారని సమాచారం. 
 

ఇక విజయ్‌ ప్రస్తుతం నటిస్తున్న `వీడీ 12` షూటింగ్‌ ఈ ఏడాది చివరి వరకు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఆయన పాత్ర షూటింగ్‌ ఈ నెలాఖరుతో కంప్లీట్‌ అవుతుందని తెలుస్తుంది. అనంతరం కొంత రెస్ట్ తీసుకుని తన నెక్ట్స్ మూవీకి వెళ్లిపోతారట. అంటే వచ్చే ఏడాది రాహుల్‌ సాంక్రిత్యాన్‌ మూవీ చేయబోతున్నారని తెలుస్తుంది. అలాగే రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. `వీడీ15`ఈ మూవీ తెరకెక్కనుంది. ఇది విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే మూవీ అని తెలుస్తుంది. రా, అండ్ రస్టిక్‌గా ఉండబోతుందట. 

read more: ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌తో అనుష్క శెట్టి రహస్య పెళ్లి?.. స్వీటి అంత బాగా చెప్పిన తర్వాత కూడా డౌటా?

also read: సుస్మితతో ఎంగేజ్‌మెంట్‌కి ముందు ఉదయ్‌ కిరణ్‌ ఎవరిని ప్రేమించాడో తెలుసా? చిరంజీవి చేరదీయడం వెనుక ఇంత కథ ఉందా?

Latest Videos

click me!