మరోవైపు నీకు ఏమాత్రం విలువ ఇవ్వని వ్యక్తి కోసం ఎందుకు అంత ఎదురు చూస్తావు అని తల్లిని అడుగుతాడు విక్రమ్. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను పైకి నిబ్రంగా కనిపిస్తున్న నీ గుండెల్లో సంఘర్షణ ఊహించగలను అంటుంది రాజ్యలక్ష్మి. అది నా దురదృష్టం అంటాడు విక్రమ్. నీ నోటి నుంచి అలాంటి మాట వినకూడదు అనుకున్నాను కానీ నేను ఓడిపోయాను అంటుంది రాజ్యలక్ష్మి.