కానీ కస్టడీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా కథని సిద్ధం చేశా. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరితో 'మానాడు' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల్సింది. కానీ కుదర్లేదు. కస్టడీలో ఆయన నిర్మాణంలో ఓ చిత్రం చేయాలనే కోరిక తీరింది అని వెంకట్ ప్రభు అన్నారు. కస్టడీ కథ విషయానికి వస్తే.. మొదటి 20 నిమిషాలు ఎన్నో ఆశలతో ఉన్న కానిస్టేబుల్, అతడి ఫ్యామిలీ, ప్రేయసి కృతి శెట్టి లాంటి సన్నివేశాలతో సాగుతుంది.