ఈ చిత్రం బ్రిటిష్ నేపథ్యంలో ఉండబోతోందని.. ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర లాంచ్, షూటింగ్ గురించి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని.. ఆగస్టు లోనే ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తారని వార్తలు వచ్చాయి.