చిరంజీవితో రాజమౌళి సినిమా చేస్తే మనశ్శాంతి ఉండదు, విజయేంద్రప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు.. అడ్డుపడింది అతనేనా?

Published : Feb 27, 2025, 07:39 AM IST

Chiranjeevi-rajamouli Movie: చిరంజీవి హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాలేదు. అయితే వీరి మధ్య ఓ కథ చర్చలు జరిగాయట. దీనిపై విజయేంద్రప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.   

PREV
17
చిరంజీవితో రాజమౌళి సినిమా చేస్తే మనశ్శాంతి ఉండదు, విజయేంద్రప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు.. అడ్డుపడింది అతనేనా?
Chiranjeevi-rajamouli Movie:

Chiranjeevi-rajamouli Movie:మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. వీరి కాంబోలో మూవీ వస్తే ఎలా ఉంటుందో అందరికి ఆసక్తికరమే. ఈ కాంబో పడితే బాక్సాఫీసు పూనకాలే అని అంతా భావిస్తుంటారు.

అయితే చిరంజీవితో రాజమౌళి సినిమా చేయాలనుకున్నారు. కథ కూడా చెప్పారు. మధ్యలో ఓ వ్యక్తి కారణంగా ఆ ప్రాజెక్ట్ సెట్‌ కాలేదట. మరి ఆ మూవీ ఏంటి? ఆ కథేంటో చూద్దాం. 

27
megastar chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి మాస్‌, కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌. టాలీవుడ్‌కి ఫక్తు కమర్షియల్ దారిలో తీసుకెళ్లింది కూడా ఆయనే. పాటలు,ఫైట్లు, రొమాన్స్, కామెడీ, ఇలా అన్ని అంశాల మేళవింపుతో కూడిన సినిమాలను అందిస్తూ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించారు.

ఓ రకంగా కొన్నేళ్లపాటు టాలీవుడ్‌ని శాషించారు. ఇప్పుడు ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి చేసిన కాస్ట్యూమ్‌ బేస్డ్ చిత్రాలు, హిస్టారికల్‌ మూవీస్‌, మైథలాజికల్‌ చిత్రాలు వర్కౌట్ కాలేదు. ఆయన్ని అలాంటి పాత్రల్లో ఆడియెన్స్ చూడలేకపోయారు. 

37
Chiranjeevi-rajamouli Movie:

ఈ నేపథ్యంలో చిరంజీవితో సినిమా చేయాలని రాజమౌళి భావించారు. నిజానికి రామ్‌ చరణ్‌ చేసిన `మగధీర` కథ అసలు మొదట వెళ్లింది చిరంజీవి వద్దకే. వంద మంది వారియర్స్ చంపే వీరుడు ఎలిమెంట్ ఐడియాని చిరంజీవికి చెప్పారట రాజమౌళి.

అప్పట్లో ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు.. రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌ని చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. ఆయనకు ఈ పాయింట్‌ చెప్పారు. ఆ కథ చెప్పగానే చిరంజీవిలో గూస్‌ బంమ్స్ వచ్చాయి. పూర్తి కథని ప్రిపేర్‌ చేసుకుని రమ్మని చెప్పాడట చిరంజీవి. 

47
Chiranjeevi

ఇక అక్కడి నుంచి రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌ వెళ్లిపోయారు. అయితే వెళ్లే క్రమంలో వీరిని తన ఇంటికి తీసుకెళ్లాడు విజయబాపినీడు. టీ తాగించి అప్పట్లో సెల్‌ఫోన్‌ పెట్టుకునే చిన్న బాక్స్‌ ఒకటి వీరికి గిఫ్ట్ గా ఇచ్చాడట విజయబాపినీడు.

దాని కాస్ట్ ఆరు రూపాయలు ఉంటుంది. అది చూసి విజయేంద్రప్రసాద్‌కి అప్పుడే అర్థమైందట ఈ ప్రాజెక్ట్ వర్కౌట్‌ కాదు అని, ఆ తర్వాత విజయబాపినీడునే స్వయంగా చెప్పాడట. చిరంజీవికి గ్యాంగ్‌ లీడర్‌ లాంటి కమర్షియల్‌ సినిమాలు సెట్‌ అవుతాయి, ఇలాంటి కావు అని చెప్పాడట. 
 

57
Vijayendra prasad- photo credit -eha tv

ఇంటికెళ్లాక తండ్రి విజయేంద్రప్రసాద్‌తోనూ రాజమౌళి అదే చెప్పాడట. ఇది మనం చేయడం లేదు అని, ఈ ప్రాజెక్ట్ చేస్తే నిత్య ఘర్షణే ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. మనం ఎప్పుడూ సంఘర్షణ పడాల్సి వస్తుందని తెలిపారట. అలా చిరంజీవితో చేయాల్సి ఆ ప్రాజెక్ట్ వర్కౌట్‌ కాలేదని తెలిపారు. అప్పుడు అలాంటి అడ్డంకి రాకపోతే చిరంజీవితో `మగధీర` సినిమా చేసేవాళ్లమని తెలిపారు విజయేంద్రప్రసాద్‌.

67
magadheera

ఆ తర్వాత పూర్తి కథని రెడీ చేసి రామ్‌ చరణ్‌ కోసం చెబితే చిరంజీవి ఓకే చేశారని, అలా చరణ్‌తో `మగధీర` వర్కౌట్‌ అయ్యిందన్నారు విజయేంద్రప్రసాద్‌. రామ్‌ చరణ్‌, కాజల్‌ జంటగా, శ్రీహరి కీలక పాత్రలో నటించిన `మగధీర` 2009లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అప్పట్లో  ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 
 

77
chiranjeevi, rajamouli

ప్రస్తుతం రాజమౌళి.. మహేష్‌ బాబు హీరోగా `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో ఓ మూవీని రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ మూవీ ఉండబోతుందని, ఇందులో మహేష్‌ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తాడని సమాచారం. ఇందులో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లోని అల్లూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. త్వరలోనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. 

మరోవైపు చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఇది రూపొందుతుంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌. ఈ మూవీ ఈ సమ్మర్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. `సైరా` తర్వాత చిరంజీవి నుంచి వస్తోన్నప్రాపర్ పాన్‌ ఇండియా మూవీ ఇదే. 

read  more: ఇద్దరు తెలుగు సూపర్‌ స్టార్లకి తండ్రిగా రజనీకాంత్.. ఆయనకు కథ చెప్పిన డైరెక్టర్‌ డేర్‌కి మొక్కాలి

also read: ప్రభాస్‌ మరో సంచలన మూవీకి ఫస్ట్ స్టెప్‌.. కరెక్ట్ గా పడితే రెండు వేల కోట్ల కలెక్షన్లు జుజూబీ!

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories