బాలయ్యకు నో చెప్పిన విజయశాంతి.. వివాదాలే కారణమా..?

Published : Jun 09, 2024, 05:54 PM IST

బాలకృష్ణ సినిమాను విజయశాంతి రిజెక్ట్ చేయడం ఏంటి..? వింటానికే విచిత్రంగా ఉంది కదా..  చాలా సినిమాల్లో కలిసి నటించిన బాలయ్య  సినిమాను లేడీ సూపర్ స్టార్ ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా..?  

PREV
16
బాలయ్యకు నో చెప్పిన విజయశాంతి.. వివాదాలే కారణమా..?

టాలీవుడ్ లో సూపర్ కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. ఆ కాంబోలకు మంచి క్రేజ్ ఉంటుంది. సూపర్ హిట్ సినిమాలు కూడా వస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ లో బాలయ్య, విజయశాంతి కూడా ఉన్నారు. అప్పట్టలో వీరి సినిమాకు మంచి డిమాండ్ ఉండేది. వీరి సినిమాలకు హిట్ పర్సంటేజ్ కూడా ఎక్కువే. 

26

అయితే ఈ ఇద్దరి కాబినేషన్ ఒకానొకటైమ్ లో ఆగిపోయింది.. ఆతరువాత వీరి సినిమాలు రాలేదు. బాలకృష్ణ- విజయశాంతి కాంబినేషన్ లో చివరి సినిమా నిప్పురవ్వ. ఈసినిమా   తర్వాత బాలయ్య విజయశాంతి కాంబినేషన్ లో సినిమాలు రాలేదనే సంగతి తెలిసిందే. బాలయ్యతో నటించకపోవడానికి కారణాలేంటనే ప్రశ్నకు విజయశాంతి రీసెంట్ గా  ఆసక్తికర సమాధానం చెప్పారు. 

36

ఈ విషయంలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు లేడీ సూపర్ స్టార్. కొన్ని  వివాదాల వల్ల బాలయ్యతో కలిసి నటించలేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆమె తెలిపారు. అసలు విషయం ఏంటో వెల్లడించారు విజయశాంతి. ఆమె మాట్లాడుతూ..ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఆ సమయంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడం జరిగిందని విజయశాంతి పేర్కొన్నారు. 
 

46

నా దగ్గరకువచ్చే ప్రతీ దర్శకుడు లేడీ ఓరియోంటేడె కథలతోనే వచ్చేవారు. నిర్మాతలు కూడా అదే పంథాను ఉపయోగించారు. అందరూ అలాంటి  పాత్రలు మాత్రమే ఆఫర్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. నేను నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు స్టార్ హీరోల సినిమాలకు సమాన స్థాయిలో ఆడటంతో పాటు ఆ సమయంలో నేను తీసుకున్న రెమ్యునరేషన్ సైతం ఎక్కువని విజయశాంతి  అన్నారు. 
 

56

లేడీ ఓరియెంటెడ్ సినిమాల వల్ల హీరో ఇమేజ్ వస్తుందని యాక్షన్ సినిమాలను చేస్తానని అంత బిజీ అవుతానని నేను అనుకోలేదని ఆమె తెలిపారు. ఈ రీజన్స్ వల్లే హీరోయిన్ గా చేయలేకపోయాను అన్నారు విజయశాంతి. అంతకు మించి ప్రత్యేక కారణాలు లేవని విజయశాంతి అన్నారు. 

66

ఇక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అసలుసినిమాలకే స్వస్థి చెప్పిన ఆమె.. అనిల్ రావిపూడి రిక్వెస్ట్ చేయడంతో.. రీ ఎంట్రీ ఇచ్చి.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు. ఇప్పుడు కూడా  సెలెక్టివ్ రోల్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్  హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో విజయశాంతి నటిస్తున్నారు. అంతే కాదు ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories