ఆ సమయంలో నాకు మేనేజర్లు లేరు. నేను బాగా పాపులర్ అవుతున్న సమయంలో ఒక ప్రొడ్యూసర్ ఒకేసారి నన్ను రెండు మూడు చిత్రాలకు బుక్ చేసుకునేవారు. ముందుగా మీరు ఎప్పుడు డేట్లు ఇచ్చినా పర్వాలేదు అన్నట్లుగా చెబుతారు. ఆయా తర్వాత డేట్లు అడ్జెస్ట్ కాకపోతే గొడవ పెట్టుకుంటారు. గత 25 ఏళ్లలో నన్ను మూడు నాలుగు సార్లు బ్యాన్ చేశారు. కొన్నిసార్లు నా తప్పు, దూకుడు స్వభావం కారణం కావచ్చు.