ఆచార్య ఫెయిల్యూర్ నుంచి కోలుకున్న కొరటాల శివ .. ఇక ఎన్టీఆర్ సినిమాపై దృష్టి పెట్టాడు. తారక్ ఇచ్చిన ధైర్యంతో పని మొదలు పెట్టిన కొరటాల ఒకటికి పదిసార్లు.. ఈసినిమాకు సబంధించిన స్క్ర్నిప్ట్,ఇతర విషయాలు చెక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో గతంలో జనగా గ్యారేజ్ సినిమా చేసిన కొరటాల.. అంతకు మించిన హిట్ సినిమా ఇవ్వాలని తాపత్రేయపడుతున్నాడు. దాని కోసం సరికొత్తగా ఎత్తులు వేస్తున్నాడట కొరటాల. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో.. ఎన్టీఆర్ ఇమేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో పెరిగింది. దాంతో ఆయన ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని కొరటాల ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ను రంగంలోకి దింపబోతున్నాడట. అందులో ఫైర్ బ్రాండ్ విజయశాంతి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అత్త పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. పాత సినిమాల్లో అత్త పాత్రల మాదిరిగా ఈ పాత్రను డిజైన్ చేశారని సమాచారం.
అయితే ఈ పాత్రకి విజయశాంతి అయితే బాగుంటింది అని అభిప్రాయానికి వచ్చారట టీమ్. వెంటనే ఆమెను అప్రోజ్ అయినట్టు సమాచారం. కొరటాల స్వయంగా వెళ్ళి విజయశాంతికి కథ వివరించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? లేదా..? అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. గతంలోనే నేను సినిమాలు చేయను అని చెప్పారు విజయశాంతి. కాని తన కోసం పట్టుదలగా ప్రయత్నించిన అనిల్ రావిపూడి కోసం సరిలేదు నీకెవ్వరు సినిమా చేసింది. కాని తరువాత ఏ ప్రాజెక్ట్ కు ఆమె ఓకే అనలేదు.
ఫైర్ బ్రాండ్ విజయ శాంతి. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా అంతే. హీరోయిన్ గా 90 దశాబ్ధంలో.. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ను ఒక ఊపు ఊపిన ఈ సీనియర్ హీరోయిన్.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇక కొంత కాలం క్రితం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు హిరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది రాములమ్మ. కాని ఈసినిమా తరువాత మరో సినిమా చేయను అని చెప్పింది.
Vijayashanthi
సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన తన పాత్ర నచ్చడం వలన ఆ సినిమా చేశాను.. అంత మంచి పాత్రలు మళ్ళీ వస్తాయని అని అనుకోవడంలేదు అన్నారు విజయశాంతి. అయితే ఆమె ఆ సినిమా చేయడానికి భారీ పారితోషికం కూడా కారణం అయ్యి ఉండవచ్చు అన్న గుసగుసలు వినిపించాయి. సరిలేరు నీకెవ్వరు కోసం దాదాపు 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట విజయశాంతి.
ఇక ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాకు విజయశాంతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అందులోను కొరటాల తన సినిమాలో హీరోతో పాటు..ఒక లీడ్ క్యారెక్టర్ ను హైలెట్ చేస్తుంటా... ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ చేసిన ఆయన.. అందులో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కు ఎంత ఇపార్టెన్స్ ఇచ్చాడో తెలిసిందే...? ఇక ఇప్పుడు విజయశాంతి పాత్ర కూడా అలాగే ఉండబోతుందంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.