అప్పుడు ఆదిత్య, అలాగే దేవికి నచ్చిన స్వీట్స్ తినడానికి ఏమైనా చెయ్యు, దేవికి ఏం నచ్చుతాయో నీకు తెలుసు కదా అని అనగా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సత్య. అప్పుడు మనసులో సత్య, ఆదిత్య ఇంత ఆనందంగా నాతో మాట్లాడి ఎన్ని రోజులైంద. దేవిని చూడగానే ఉన్న బాధలన్నీ మర్చిపోతాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో మాధవ్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు చిన్మయి,రుక్మిణి అక్కడికి వస్తారు.దేవి ఏది అని అడగగా చిన్నయి నీ రుక్మిణి లోపలికి పంపించేస్తుంది. అప్పుడు రుక్మిణి,మాధవ్ తో దేవి మా ఇంటికి వెళ్ళింది వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళింది అని అంటుంది. అప్పుడు మాధవ్,నాకు కూడా అదే కావాలి.