మహేష్‌ బాబుతో `జేమ్స్ బాండ్‌` మూవీ.. చిన్నమ్మ విజయ నిర్మల ప్లాన్‌.. ఏం జరిగింది?

First Published May 22, 2024, 9:24 AM IST

మహేష్‌ బాబుతో ఇప్పుడు `ఇండియానా జోన్స్ `తరహా మూవీ చేస్తున్నారు రాజమౌళి. కానీ గతంలోనే `జేమ్స్ బాండ్‌` లాంటి మూవీ ప్లాన్‌ చేశారట చిన్నమ్మ విజయ నిర్మల. 
 

సూపర్‌ స్టార్‌ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేష్‌ బాబు. ఆ లెగసీని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. తను కూడా సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ఇప్పుడు కెరీర్‌ పరంగా మరో మెట్టు ఎక్కే సినిమా చేస్తున్నారు. రాజమౌళితో ఆయన మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. 
 

 ఈ మూవీ `ఇండియానా జోన్స్` తరహాలో ఉంటుందని రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ చెబుతూ వస్తున్నారు. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. ఇంటర్నేషనల్‌ మూవీ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. మహేష్‌ బాబు బాడీ వర్కౌట్స్ చేస్తుంటే, రాజమౌళి కాస్టింగ్‌, లొకేషన్స్ వంటివి సెట్‌ చేసే పనిలో ఉన్నారు. 

ఇదిలా ఉంటే అన్నీ కుదిరితే మహేష్‌ బాబు ఇప్పటికే `జేమ్స్ బాండ్‌`గా కనిపించేవాడు. ఇండియన్‌ జేమ్స్ బాండ్‌గా తెలుగు ఆడియెన్స్ ని అలరించేవాడు. ఆయన ఫాదర్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణ తొలి కౌబాయ్‌గా `మోసగాళ్లకి మోసగాడు` చిత్రంలో నటించి మెప్పించాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అది ప్రత్యేకంగా నిలిచింది. అలానే మహేష్‌ని కూడా జేమ్స్ బాండ్‌లా చూపించాలని అనుకున్నారట మహేష్‌ చిన్నమ్మ. 
 

మహేష్‌ బాబు చిన్నమ్మ(సవతి తల్లి) విజయ నిర్మల తన మనసులో మాట బయటపెట్టింది. కొన్నేళ్ల క్రితం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపింది. మహేష్‌ బాబుతో సినిమా చేయాల్సి వస్తే ఎలాంటి సినిమా చేస్తారని యాంకర్‌ ప్రశ్నించింది. దీనికి విజయ నిర్మల ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పింది. తాను మహేష్‌ బాబుతో జేమ్స్ బాండ్‌ లాంటి మూవీ చేయాలని ఉందని వెల్లడించింది. 
 

అయితే అప్పటికి అది విజయనిర్మల మనసులో ఉన్న మాటనే. కానీ కార్యరూపం దాల్చలేదు. పైగా అప్పటికే ఆమె దర్శకురాలిగా సినిమాలు మానేశారు. వయసు సహకరించని నేపథ్యంలో ఆమె పూర్తిగా ఫ్యామిలీకే పరిమితం అయ్యారు. కృష్ణతో కలిసి అడపాదడపా సినిమా ఈవెంట్లలో మెరిసేవారు. సినిమాలు చేసే పరిస్థితి లేదు. దీంతో మహేష్‌ బాబుతో జేమ్స్ బాండ్‌ లాంటి మూవీ కేవలం ఆలోచన దశలోనే ఆగిపోయింది.  
 

హీరోయిన్‌గా జీవితాన్ని ప్రారంభించిన విజయ నిర్మల తొలితరం కథానాయికల్లో స్టార్‌ హీరోయిన్ గా వెలిగింది. అంతేకాదు దర్శకురాలిగా మారి 44 మూవీస్‌ రూపొందించింది గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. కృష్ణతోనే అత్యధిక మూవీస్‌ చేసింది. కానీ మహేష్‌తో సినిమాలు చేయలేకపోయింది. మహేష్‌ హీరోగా ఎదిగే నాటికి విజయ నిర్మల సినిమాలు మానేసింది. విజయ నిర్మల ఐదేళ్ల క్రితం ఆమె కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె లేకపోవడంతో ఒంటరైనా కృష్ణ రెండేళ్ల క్రితం కన్నుమూశారు.
 

Latest Videos

click me!