రేణు దేశాయ్ టార్గెట్ చేస్తూ తరచూ పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతుంటారు. ఇటీవల మరోసారి వీరి మధ్య రచ్చ జరిగింది. పవన్‌పై, అభిమానులపై రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేసింది.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి 11ఏళ్లు అవుతుంది. అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో రూపంలో రేణు దేశాయ్‌ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమెపై కామెంట్ చేస్తున్నారు అభిమానులు. వారికి కూడా గట్టిగా ఇచ్చిపడేస్తుంది రేణు దేశాయ్. ఇప్పుడు మరోసారి వీరి మధ్య రచ్చ జరిగింది.
26
రేణు దేశాయ్ పెట్ లవర్. పిల్లలుంటే తనకు చాలా ఇష్టమట. యాంకర్ రష్మి కుక్కలపై ప్రేమని చూపించినట్టుగానే రేణు దేశాయ్ పిల్లులపై ఇంట్రెస్ట్ ని చూపిస్తుంది. వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుంది. అంతేకాదు వాటి సంరక్షణ కోసం ప్రతి నెల కొంత డొనేషన్ కూడా ఇస్తుందట. ఇటీవల ఆమె పిల్లుల పోషణకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రూ.3500 విరాళం కావాలని నెటిజన్లని రిక్వెస్ట్ చేసింది.
36
దీనికి మంచి స్పందనే వచ్చింది. వెంటనే తనకు కావాల్సిన మనీ వచ్చాయని ఆమె ధన్యవాదాలు తెలియజేసింది. అయితే కనీసం 3500 కూడా తన వద్ద లేవా అనే కామెంట్లు కూడా వచ్చిన నేపథ్యంలో ఆమె ప్రతి నెల తాను కొంత అమౌంట్ డొనేట్ చేస్తానని, అయితే ఈ నెలకు సంబంధించిన బడ్జెట్ లిమిట్ అయిపోయిందని, అందుకే విరాళం అడగాల్సి వచ్చిందని చెప్పింది. తన వద్ద ఉన్న డబ్బులను నెలకు ఇంత అని అడ్జెస్ట్ చేసుకుంటానని, నెలలో బడ్జెట్ లిమిట్ ఉంటుందని, అది దాటిపోతేనే ఇలా విరాళం అడుగుతానని, ఎందుకంటే తనకు ఫ్యామిలీ, పిల్లలున్నారు. ఆ ఖర్చులు కూడా చూసుకోవాలని చెప్పింది రేణు దేశాయ్.
46
Pawan Kalyan
ఈ నేపథ్యంలో ఆమెని టార్గెట్ చేస్తూ నెటిజన్లు కొందరు విమర్శలు చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌కి ముడిపెడుతూ పోస్ట్ లు పెట్టారు. ఎంతైనా పవన్ కళ్యాణ్ వైఫ్ కదా, పవన్ లాగే గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్లు చేశారు. దీనిపై రేణు దేశాయ్ గట్టి ఇచ్చేసింది. పెట్స్ పై నాకున్న ప్రేమ ఆయనకు లేదని మండిపడింది. ఇది కాస్త రచ్చగా మారింది. పవన్ కి జంతువులపై ప్రేమ లేదా? మీరు అలా మాట్లాడవద్దని, మీ పిల్లలకు ఆయన తండ్రి అని, మీ మీద ఆయనకు బాధ్యత ఉంటుందని రెచ్చిపోతూ కామెంట్లు చేశారు పవన్ ఫ్యాన్స్.
56
దీనికి మండిపోయిన రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేసింది. ఫస్ట్ నేను ఇప్పుడు ఆయన భార్యని కాదు. నా మీద ఆయనకు బాధ్యత ఎందుకు ఉంటుంది, నేను యానిమల్స్ ని ప్రేమించినంతగా ఆయన ప్రేమించలేడు. ఈ 55ఏళ్లలో ఆయన ఇంట్లో పిల్లులు, కుక్కలు వంటివి కూడా కనిపించవు. నాకు లెక్చరర్స్ ఇవ్వడం ఇకనైనా ఆపండి, ఇన్నేళ్లు నన్ను తిడుతూనే ఉన్నారు, ఇకనైనా ఆపండి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఈ ఛాటింగ్ వైరల్ గా మారింది. ఇలా తరచూ రేణుదేశాయ్‌కి, పవన్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంటుంది.
66
photo credit prema interview
ఇక రేణు దేశాయ్ ప్రస్తుతం పూర్తిగా పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది. అడపాదడపా సినిమాల్లో మెరుస్తుంది. ఆ మధ్య టీవీ షోలో జడ్జ్ గా కనిపించింది. అంతేకాదు `టైగర్ నాగేశ్వరరావు` సినిమాలో కీలక పాత్రలో మెరిసింది. ఇప్పుడు ఒకటి రెండు సినిమాల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటుంది రేణు దేశాయ్. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది.