మురళీ మోహన్‌ అసలు ఆర్టిస్టే కాదు.. చంద్రబాబుతో కలిసి వందల ఎకరాలు కాజేశాడు.. సీనియర్‌ రైటర్‌ సంచలన వ్యాఖ్యలు

First Published | May 22, 2024, 7:03 AM IST

సీనియర్‌ నటుడు మురళీమోహన్‌పై సీనియర్‌ రైటర్‌ తోటపల్లి మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. మురళీ మోహన్‌ అసలు ఆర్టిస్టే కాదంటూ దుమారం రేపారు. 
 

మురళీ మోహన్‌ అంటే ఇండస్ట్రీలో వివాదరహితుడు అనే పేరుంది. ఆయన సీనియర్‌ ఎన్టీఆర్ తరం నుంచి నేటి తరం వరకు మూడు తరాల నటులతోనూ కలిసి నటిస్తున్నారు. హీరోగా అనేక సినిమాలు చేశారు. ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేశారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించారు. ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో మెరుస్తూనే ఉన్నారు. 

మురళీ మోహన్‌ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాస్త రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వ్యాపారాలు, ఒకటి అర సినిమాల్లో కనిపిస్తున్నారు. ఫిట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తారు మురళీ మోహన్‌. 83ఏళ్ల వయసులోనూ చాలా ఫిట్‌గా ఉన్నారు. చాలా యాక్టివ్‌గా ఉన్నారు. దీనికి సిస్టమాటిక్‌ లైఫ్‌, ఫుడ్‌, వ్యాయామాలే కారణమంటారు. 


ఈ నేపథ్యంలో మురళీ మోహన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్‌ రైటర్‌ తోటపల్లి మధు. మురళీ మోహన్‌ అసలు ఆర్టిస్టే కాదంటూ షాక్‌ ఇచ్చాడు. ఐడ్రీమ్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మురళీమోహన్‌ అసలు ఆర్టిస్టే కాదమ్మా,.. మురళీమోహన్‌ ఫలానా సినిమాలో అద్భుతంగా చేశాడు, ఆ పాత్రలో అబ్బ ఎంత బాగా చేశాడని ఒక్కరైనా చెబుతారా? అని ప్రశ్నించాడు. 
 

అంతేకాదు చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్ని వేల ఎకరాలు దొబ్బేశారని చెబితే వింటారు. అంతేకాని ఆయన నటన గురించి ఒక్కడూ మాట్లాడుకోరు అని, ఆయన బాగా అద్బుతంగా చేశాడని చెప్పడానికి ఒక్కసినిమా కూడా లేదంటూ షాకిచ్చాడు రైటర్‌, నటుడు తోటపల్లి మధు. ఇటీవల ఈ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఇందులో చంద్రమోహన్‌, శోభన్‌బాబులపై ఆయన ప్రశంసలు కురిపించడం విశేషం. 
 

ఇక యంగ్‌ ఏజ్‌లోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి రైటర్‌గా అడుగుపెట్టాడు తోటపల్లి మధు. 1984లో `దేవాంతకుడు` చిత్రంతో రైటర్‌గా మారాడు. ఈ మూవీకి చిరంజీవి హీరో. తొలి చిత్రంతోనే రైటర్‌గా ఆకట్టుకున్నాడు. ఇలా పెద్ద పెద్ద హీరోల సినిమాలకు రైటర్ గా పని చేసి మెప్పించారు.

తనదైన రైటింగ్‌తో ప్రత్యేకతని చాటుకున్నారు. రైటర్‌గా 190కిపైగా చిత్రాలకు పనిచేశారు. అంతేకాదు నటుడిగానూ ఆకట్టుకున్నారు. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రల్లో కనిపించి అలరించారు. ‌

Latest Videos

click me!