జెస్సీకి  నేను నటుడు కావడం ఇష్టం లేదు

First Published Apr 18, 2021, 8:18 AM IST

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి లైఫ్ పెద్ద మెస్సేజ్ అని చెప్పాలి. ఎటువంటి సప్పోర్ట్ లేకుండా ఆయన చిత్ర పరిశ్రమలో స్టార్ గా ఎదిగారు. సౌత్ ఇండియాలోనే విజయ్ సేతుపతి అంటే తెలియని ప్రేక్షకుడు లేడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ గొప్ప నటుడన్న ఇమేజ్ సంపాదించారు. 
 

ఇంత అద్భుత నటుడు ప్రస్థానం ఎలా మొదలైంది అనేది తెలుసుకుంటే... ఎవరికైనా దిమ్మ తిరుగుతుంది. సినిమాలకు మించిన నాటకీయత విజయ్ సేతుపతి జీవితంలో ఉంది. నటుడు కాక ముందు ఆయన అనేక కష్టాలు పడ్డారు.
undefined
విజయ్ సేతుపతి తండ్రి సివిల్ ఇంజనీర్. ఆయన సంపాదనతోనే ఏళ్లు మొత్తం గడవాలి. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఎవరో చెప్పారని, దుబాయ్ వెళ్ళాడట విజయ్. అక్కడ మంచి జీతం వచ్చినప్పటికీ విపరీతమైన వేడి, సరైన భోజనం ఉండేది కాదట. దీనితో దుబాయ్ నుండి వచ్చేశారట.
undefined
ఆ తరువాత ఫ్రెండ్స్ లో కలిసి ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించిన ఓ చిన్న వ్యాపారం మొదలుపెట్టాడట. అయితే అది అంతగా సాగలేదట. తన జీవితాన్ని మార్చింది మాత్రం, ఓ నాటకం పోస్టర్ అట.  ఆ పోస్టర్ చూసి నటుడిగా అవకాశం కోసం నాటక సమాజం వాళ్ళను అడిగారట. అయితే నటుడిగా అవకాశాలు లేవు, అకౌంటెంట్ పోస్ట్ ఉంది చేస్తావా అని అడగడంతో సరే అన్నారట. ఆ నాటక సమాజంలో అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాడట.
undefined
కొన్నాళ్లకు విజయ్ ఆసక్తి చూసి నటించడానికి అవకాశం ఇచ్చారట. విజయ్ సేతుపతి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ.. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ బాలు మహేందర్ ని కలిశారట. ఆయన నేను ప్రస్తుతం సినిమాలు ఏమి చేయడం లేదు అని చెప్పారట.  నేను మీ దగ్గరకు సినిమా అవకాశం కోసం రాలేదు. నటుడిగా అవకాశాలు అడగడానికి నా దగ్గర సరైన ఫోటోలు లేవు, మీరు తీసిపెట్టాలి అన్నారట.  దానికి ఆయన నన్ను ఎవరూ ఇలా అడగలేదయ్యా అంటూ, విజయ్ సేతుపతి ఫోటోలు తీశారట. మంచి ఫోటో జెనిక్ పేస్, పెద్ద నటుడివి అవుతావ్ అని ఆయన అన్నా
undefined
బాలు మహేందర్ తీసిన ఫోటోలు ఇంట్లో అద్దం వెనుక దాచాడట విజయ్ సేతుపతి. ఓ రోజు ఆ ఫోటోలను విజయ్ సేతుపతి భార్య జెస్సీ చూశారట. విజయ్ ని పక్కకు తీసుకెళ్లి, నా గర్భంపై ఒట్టేసి, నిజం చెప్పు... నువ్వు సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నావా అని అడిగారట. అలాగే ఆ ఆలోచన మానేయాలని గట్టిగా చెప్పారట.
undefined
విజయ్ సేతుపతి భార్యకు ఆయన నటుడు కావడం ఇష్టం లేకపోయినా, నాన్న ప్రోత్సహించేవారట. కెరీర్ బిగినింగ్ లో ప్రాధాన్యం లేని చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ సేతుపతికి, కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఫిజ్జా మంచి బ్రేక్ ఇచ్చింది. అనేక కష్టాలు పడి నటుడిగా మారిన విజయ్ అతి తక్కువ కాలంలో 45కి పైగా సినిమాలు చేశారు.
undefined
click me!