దేశంలోని బెస్ట్ డాన్సర్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి స్టెప్ అయినా.. ప్రాక్టీస్ చేయకుండా వెంటనే చేయగల హీరో ఎన్టీఆర్. ఈ విషయాన్ని పలువురు కొరియోగ్రాఫర్స్ వెల్లడించారు. ఎన్టీఆర్ ఎలాంటి డాన్స్ రిహార్సల్స్ చేయరు. నేరుగా వేసేయగలరంటూ, ఆయన ప్రతిభను కొనియాడారు.
ఎన్టీఆర్ బాల్యంలో శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. కూచిపూడి నేర్చుకున్న ఎన్టీఆర్ పలు స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. మోడ్రన్ డాన్స్ ఆయన అలవోకగా చేయడం వెనుక కారణం ఇదే. గతంలో భారీ కాయంతో కూడా ఎన్టీఆర్ కఠినమైన స్టెప్స్ వేగంగా వేసేవాడు. ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం చాలా కష్టమని ఇటీవల జాన్వీ కపూర్, అన్నారు.