విజయ్ దేవరకొండ ఇల్లీగల్ గా చేయలేదు, సుప్రీంకోర్టే చెప్పింది..బెట్టింగ్ యాప్స్ వివాదంపై అతడి టీమ్ కామెంట్స్

Published : Mar 20, 2025, 08:11 PM IST

బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారమవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

PREV
14
విజయ్ దేవరకొండ ఇల్లీగల్ గా చేయలేదు, సుప్రీంకోర్టే చెప్పింది..బెట్టింగ్ యాప్స్ వివాదంపై అతడి టీమ్ కామెంట్స్
Vijay Devarakonda

బెట్టింగ్ యాప్స్ వివాదం టాలీవుడ్ ని కుదిపేస్తోంది. విష్ణుప్రియ, రీతూ చౌదరి, టేస్టీ తేజ, హర్ష సాయి లాంటి చిన్న సెలెబ్రిటీలు ఈ వివాదంలో చిక్కుకున్నారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవకొండ, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్ లాంటి పెద్ద తలకాయల పేర్లు కూడా ఈ వివాదంలో వినిపిస్తున్నాయి. 

 

24

బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారమవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు.

34

విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది.
 

44

ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు అని విజయ్ దేవరకొండ టీం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వివరణని పోలీసులు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. 

 

Read more Photos on
click me!

Recommended Stories