Manchu Vishnu
మంచు విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది. సమ్మర్ లో ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో 140 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందనే వచ్చింది కానీ.. లొకేషన్స్, కొన్ని ఇతర విషయాల్లో విమర్శలు, కామెంట్స్ తప్పడం లేదు.
prabhas, manchu vishnu
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మంచు విష్ణు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. తనని విమర్శించే వారికి బుల్లెట్స్ లాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు. కన్నప్ప అనేది మన నేలపై జరిగిన కథ. కానీ దానిని న్యూజిలాండ్ లో చిత్రీకరించడానికి కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా మంచు విష్ణు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మహాభారతం ఎక్కడ జరిగిందో ఎవరికైనా తెలుసా.. మహా భారతం ఆధారంగా వచ్చిన చిత్రాలని ఏ ఏ లొకేషన్స్ లో చిత్రీకరించారు అనేది ఎవరైనా పట్టించుకుంటరా ? అని ప్రశ్నించారు. ఎక్కడ చిత్రీకరించాం అనేది ముఖ్యం కాదు.. అందులో కథని ఎలా తీసాం అనేది ముఖ్యం అని మంచు విష్ణు తెలిపారు.
అయితే పర్టికులర్ గా న్యూజిలాండ్ ని ఎంచుకోవడానికి కారణం ఉంది. 2 వ శతాబ్దంలో మన దేశంలో అడవులు ఎంతో అందంగా ఉండేవి. అయితే ఆ అడవులు ఎలా ఉండేవి అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడున్నట్లు పొల్యూషన్ లేదు. మొత్తం పచ్చదనం ఉండేది. అలాంటి అంశాలని పరిగణలోకి తీసుకుని పచ్చదనం, పక్షుల కికిలా రావాలు ఉండే ప్రాంతం కావాలని అనుకున్నాం. ప్రపంచం మొత్తంలో అలా తనకి అనిపించిన దేశం న్యూజిలాండ్ అని మంచు విష్ణు తెలిపారు. అందుకే అక్కడ చిత్రీకరించినట్లు పేర్కొన్నారు.
ఆదిపురుష్ చిత్రాన్ని కూడా వేరే దేశాల్లో షూట్ చేయడం వల్ల దెబ్బైపోయింది అని ప్రశ్నించగా.. ఆ మూవీతో కన్నప్ప చిత్రాన్ని పోల్చవద్దు అని మంచు విష్ణు తెలిపారు. ఆదిపురుష్ మూవీ మొత్తం గ్రీన్ మాట్ లో చిత్రీకరించారు. అసలు అది రామాయణమే కాదు. రామాయణం ఇలా జరిగి ఉండొచ్చని ఊహించి ఆ చిత్రాన్ని చేశారు. అందుకే ఆదిపురుష్ చిత్రం వర్కౌట్ కాలేదు అని మంచు విష్ణు తెలిపారు.
ఒక సినిమాకి కథ కీలకం.. అది బావుంటే మిగిలిన విషయాలని ప్రేక్షకులు పట్టించుకోరు అని విష్ణు తెలిపారు. కన్నప్ప కి టీజర్ లో బొట్టు కనిపించడం లేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు చరిత్ర తెలుసా అని మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. 2 వ దశాబ్దంలో ఆటవికులని గుడిలోకి రానిచ్చేవారా అని మంచు విష్ణు ప్రశ్నించారు.