లిప్ కిస్ సీన్ చేసేటప్పుడు నరకం అనుభవించా, చుట్టూ వందల మంది.. అనుపమ సంచలన వ్యాఖ్యలు

First Published | Mar 27, 2024, 7:44 PM IST

మరో రెండు రోజుల్లో టిల్లు స్క్వేర్ సందడి థియేటర్స్ లో మొదలు కానుంది. సమ్మర్ లో నవ్వుల జల్లులు కురిపించేందుకు టిల్లు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రంపై సాలిడ్ బజ్ ఏర్పడి ఉంది.

మరో రెండు రోజుల్లో టిల్లు స్క్వేర్ సందడి థియేటర్స్ లో మొదలు కానుంది. సమ్మర్ లో నవ్వుల జల్లులు కురిపించేందుకు టిల్లు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రంపై సాలిడ్ బజ్ ఏర్పడి ఉంది. డీజే టిల్లు చిత్రంలో సిద్దు జన్నలగడ్డ కామెడీ టైమింగ్, యాటిట్యూడ్, రొమాన్స్ యువతని విపరీతంగా ఆకట్టుకున్నాయి. టిల్లు స్క్వేర్ అంతకి మించి ఉంటుంది అన్నట్లు హింట్స్ ఇస్తున్నారు. 

ఈ చిత్రంలో సిద్దుకి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. అనుపమ తన కెరీర్ లో ఎన్నడూ లేనంత బోల్డ్ గా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినట్లు ఇప్పటికే అర్థం అయింది. ట్రైలర్స్, టీజర్స్ లో సిద్దుతో ఆమె కెమిస్ట్రీని బాగా హైలైట్ చేశారు. యువతని ఈ చిత్రం పట్ల ఆకర్షిస్తున్న అంశాలలో అది కూడా ఒకటి. 


అయితే అనుపమకు ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో రొమాంటిక్ సీన్స్ కి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే అనుపమ మాత్రం ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ పై ఊహించని కామెంట్స్ చేసింది. యాంకర్ లిప్ కిస్, రొమాన్స్ గురించి ప్రశ్నించగా అనుపమ ఇచ్చిన సమాధానం షాకింగ్ గా ఉంది. 

మీరు రొమాంటిక్ సీన్స్ గురించి మాట్లాడుతున్నారు. అందరూ వాటిగురించే మాట్లాడుతున్నారు. కానీ రొమాంటిక్ సీన్ లో నటించి ఎగ్జిక్యూట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. సెట్ లో వందల మంది మధ్యలో అలాంటి సీన్ లో నటించాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇద్దరు ఇంటిమేట్ గా ఉన్నారంటే అది వాళ్ళిద్దరి  ప్రైవేట్ మూమెంట్. 

కానీ దానిని సెట్ లో చిత్ర యూనిట్ ముందు చేయాలి. కారులో లిప్ కిస్ సీన్ ఉంది. ఆ సీన్ చేసే సమయంలో నా రెండు కాళ్లకు గాయాలు ఉన్నాయి.  ఎంత నరకమో తెలుసా.. ఆ బాధని భరిస్తూ నటించాలి. నటించడమే కాదు.. నిజంగా రొమాన్స్ చేస్తున్నట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలి.. ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా ఆ సీన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. అది అంత సులభం కాదు. చూస్తున్న వారేమో ఆ వాళిద్దరూ రొమాన్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు లే అని అనుకుంటారు. కానీ వాస్తవం అది కాదు అని అనుపమ తెలిపింది. 

అనుపమ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అ..ఆ చిత్రంతో అనుపమ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శతమానం భవతి, రాక్షసుడు, కార్తికేయ 2, ఈగల్ లాంటి చిత్రాల్లో నటించింది. టిల్లు స్క్వేర్ చిత్రం అనుపమకు సరికొత్త ఇమేజ్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు. 

Latest Videos

click me!