విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన్': టైటిల్ వెనుక కథేంటి?

Published : Mar 05, 2025, 02:33 PM IST

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో 'రౌడీ జనార్దన్' అనే చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి 'దిల్' రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ టైటిల్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

PREV
14
విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన్': టైటిల్ వెనుక కథేంటి?
Vijay Deverakonda Ravi Kiran Kola Film Title Rowdy Janardhan in Telugu

 
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మళ్లీ ఫామ్ లోకి రావటానికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న విజయ్... 'రాజు వారు... రాణి గారు' చిత్ర దర్శకుడు రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని అంగీకరించాడు.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 'దిల్' రాజు నిర్మిస్తారు.  కాగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత రాజు ఈ చిత్రం టైటిల్‌ను లీక్ చేశాడు. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ ఆ వరుసలోనే విజయ్ దేవరకొండ చిత్రానికి 'రౌడీ జనార్దన్' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. ఇప్పుడీ టైటిల్ వైరల్ అవుతోంది.

24
Vijay Deverakonda Ravi Kiran Kola Film Title Rowdy Janardhan in Telugu

ఇప్పుడీ టైటిల్ పెట్టడానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు సోషల్ మీడియా జనం. విజయ్ ని ముద్దుగా అభిమానులు రౌడీ అనిపిస్తూంటారు కాబట్టి ఈ టైటిల్ పెట్టారని కొందరు అంటున్నారు.

అదేమి లేదు సినిమాలో రౌడిగా బిహేవ్ చేస్తూంటాడు విజయ్ అందుకే ఈ టైటిల్ తో ముందుకు వెళ్తున్నారని మరికొందరంటున్నారు. ఏది అనేది డైరక్టరే తేల్చి చెప్పాలి. 
'కత్తి నేనే... నెత్తురు నాదే... యుద్ధం నాతోనే' అంటూ విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా 'రౌడీ జనార్ధన్' ప్రీ లుక్ విడుదల చేశారు.‌ 

34
Vijay Deverakonda Ravi Kiran Kola Film Title Rowdy Janardhan in Telugu


'అతని చేతికి అంటున్న నెత్తురు వాళ్ళ చావుకు చిహ్నం కాదు... అతని పునర్జన్మకు సూచిక' అంటూ మరింత ఆసక్తి పెంచేశారు దర్శకుడు రవి కిరణ్ కోలా. ఇప్పుడు సినిమా టైటిల్ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది.

 విజయ్ దేవరకొండతో 'దిల్' రాజు నిర్మించిన 'ఫ్యామిలీ స్టార్' ఆశించిన సక్సెస్ అందలేదు. ఈ సినిమాతో భారీ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు హీరో అండ్ ప్రొడ్యూసర్. 

44
Vijay Deverakonda Ravi Kiran Kola Film Title Rowdy Janardhan in Telugu

గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం వేచి చూస్తున్న హీరో  విజయ్ దేవరకొండ. ఆయన నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. ప్రస్తుతం ఈ క్రేజీ హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్‌డమ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

మే 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని కూడా చేస్తున్నాడు.  

Read more Photos on
click me!

Recommended Stories