సూపర్ హిట్ ‘ఛావా’OTT రిలీజ్ డేట్ , స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్

Published : Mar 05, 2025, 01:54 PM IST

Chhaava OTT Release :  విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఛావా సినిమా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది,  తెలుగులో మార్చి 7న విడుదల కానుంది.

PREV
13
సూపర్ హిట్ ‘ఛావా’OTT రిలీజ్ డేట్ , స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్
Vicky Kaushal Chhaava OTT release: Know when and where to watch in telugu

Chhaava OTT Release : మన దేశంలో ఇప్పుడు జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్న చిత్రం ఛావా(Chhaava ). ఈ సినిమా  ప్రస్తుతం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోంది. విక్కీ కౌశల్‌, రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో రిలీజై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది.

ఇప్పటికీ తగ్గేదేలే అన్న స్దాయిలో కలెక్షన్స్ ఉన్నాయి.  దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికి 500 కోట్లు దాటి పరుగెడుతోంది.  ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్(రూ.31 కోట్లు) సొంతం చేసుకున్న చిత్రంగా ఛావా నిలిచింది.

అంతేకాదు విక్కీ కౌశల్‌ కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఛావా రికార్డుకెక్కింది. ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ సంపాదించుకోవడంతో ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 

23
Vicky Kaushal Chhaava OTT release: Know when and where to watch in telugu


బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా  డిజిటల్‌ రైట్స్‌ని భారీ ధరకే కొనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌. సినిమా రిలీజ్ కు ముందే ఓటిటి బిజినెస్ అయ్యిపోయింది.

దాంతో సినిమా యావరేజ్‌ టాక్‌ వస్తే నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకున్నారట. కానీ ఊహించని విధంగా సూపర్ హిట్‌ టాక్‌ రావడంతో ఓటీటీ రిలీజ్‌ని పోస్ట్‌పోన్‌ చేసారు. దాంతో ఈ చిత్రం   Netflix అన్ని భాషల్లోనూ  11th ఏప్రియల్ న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది.  
 

33
Vicky Kaushal Chhaava OTT release: Know when and where to watch in telugu


బాలీవుడ్‌లో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం మార్చి 7న తెలుగులో విడుదల కానుంది.   ‘ఛావా’ని తెలుగు లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే అన్ సీజన్ లో రిలీజ్ చేయటానికి గల కారణం ఓటిటి అని నిర్మాత బన్ని వాసు చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ...ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి చిత్ర నిర్మాతలకు కొన్ని డేట్స్‌ ఫిక్స్‌ అయిపోయి ఉంటాయి.

నిజం చెప్పాలంటే, పరీక్షల సమయంలో సినిమా రిలీజ్‌కు ఇది కాస్త క్లిష్ట సమయమే. అయినప్పటికీ ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఎంజాయ్‌ చేయాలనే ఉద్దేశంతోనే దీనిని ఇప్పుడు రిలీజ్‌ చేస్తున్నాం. దీనిని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నందుకు గర్వపడుతున్నా అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories