టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు వరుసగా ఫ్లాప్స్ అందుతున్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలు విడుదలకు ముందుకు ఒకలా.. రిలీజ్ తర్వాత మరోలా అన్నట్టు పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే రౌడీ హీరో మరో ఫ్లాప్ నుంచి తప్పించుకున్నారు.
’నువ్విలా‘ చిత్రంతో విజయ్ హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ’లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‘, ’ఎవడే సుబ్రహ్మణ్యం‘ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కాస్తా క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన ’పెళ్లి చూపులు‘ సినిమా విజయ్ కు సక్సెస్ అందించింది.
ఆ తర్వాత వచ్చిన ’అర్జున్ రెడ్డి‘, ’గీతాగోవిందం‘ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. విజయ్ ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. అయితే తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాఫ్ అవుతూనే వచ్చాయి. ఈ క్రమంలో విజయ్ చేయాల్సిన ఓ ప్రాజెక్ట్ కూడా తాజాగా రిలీజ్ అయ్యి ఫ్లాప్ గా నిలిచింది.
లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ’అన్నీ మంచి శకునములే‘. ఈ చిత్రం మొదట విజయ్ దేవరకొండతో చేయాలని నందినిరెడ్డి భావించారు. కథ కూడా నేరెట్ చేశారు. విజయ్ కూడా ఓకే చెప్పారంట. అయితే ఇది ’అర్జున్ రెడ్డికి‘ ముందే ప్రారంభం కావాల్సిన చిత్రం.
’అర్జున్ రెడ్డి‘తో విజయ్ క్రేజ్ మారిపోవడం, ఆడియెన్స్ లో అంచనాలు పెరగడంతో నందిని రెడ్డి విజయ్ తో సినిమా వర్కౌట్ కాదనుకుందంట. దీంతో సంతోష్ శోభన్ తో మూవీని తెరకెక్కించింది. నిన్న (May 18)న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది.
విజయ్ దేవరకొండ చేసి ఉంటే ఆయన ఖాతాలో మరో ఫ్లాప్ ఉండేదని పలువురు అంటున్నారు. నందిని రెడ్డి నిర్ణయంతో విజయ్ ఇంకో ఫ్లాప్ నుంచి తప్పించుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ’నోటా‘, ’టాక్సీవాలా‘, ’డియర్ కామ్రేడ్‘, ’వరల్డ్ ఫేమస్ లవర్‘, ’లైగర్‘ వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్ ’ఖుషి‘, ’VD12‘పై ఆశలు పెట్టుకున్నారు.