కేన్స్ లో ఐశ్వర్యారాయ్ మెరుపులు, వెండి బుట్టని మోస్తోందా అంటూ ట్రోలింగ్.. అందరి చూపు ఆమె డ్రెస్ పైనే..

Published : May 19, 2023, 01:34 PM IST

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ నీలికళ్ళ సుందరే. 

PREV
110
కేన్స్ లో ఐశ్వర్యారాయ్ మెరుపులు, వెండి బుట్టని మోస్తోందా అంటూ ట్రోలింగ్.. అందరి చూపు ఆమె డ్రెస్ పైనే..

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ నీలికళ్ళ సుందరే. 

210

తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. మణిరత్నం కలల ప్రాజెక్ట్ ఇది.    

 

310

నందిని పాత్రలో ఐశ్వర్యారాయ్ నట విశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. విక్రమ్ తో కలసి ఆమె నటించిన విధానం అందరిని మెస్మరైజ్ చేసింది. అందంగా కనిపిస్తూనే ఐశ్వర్యరాయ్ ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. 

410

ప్రస్తుతం కేన్స్ 2023 ఫిలిం ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మృణాల్ ఠాకూర్ లాంటి ఇండియన్ నటీమణులు కేన్స్ లో మెరుస్తున్నారు. 

510

ఐశ్వర్యారాయ్ రెగ్యులర్ గా ప్రతి ఏటా కేన్స్ లో తన అందాలు ఒలకబోస్తూ ఉంటుంది. ఈసారి ఐశ్వర్యారాయ్ కేన్స్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఐశ్వర్యారాయ్ ధరించిన కాస్ట్యూమ్ చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. 

 

610

బుట్టబొమ్మలా కనీసం గాలి కూడా ఆడకుండా ఒళ్ళంతా కప్పి ఉంచే డ్రెస్ లో ఐశ్వర్యారాయ్ మెరుపులు మెరిపించింది. ఆ డ్రెస్ ఆమెకి ఓ గొడుగు తరహాలో ఉంది. 

710

ముఖం మాత్రమే కనిపిస్తూ ఐశ్వర్యారాయ్ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇంటర్నెట్ మొత్తం ఐశ్వర్యారాయ్ కేన్స్ ఫోజులతో నిండిపోతోంది. ఆమె ఫోజులు చూస్తున నెటిజన్లు ఇదేం డ్రెస్ బాబోయ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

810

వెండి బుట్టలాంటి డ్రెస్ లో ఐశ్వర్యారాయ్ ఫోజులు అద్భుతంగా ఉన్నాయని కొందరు అంటుంటే.. మరికొందరు బుట్టలు మోయడానికి వెళ్లిందా కేన్స్ కి అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

910

ఇదిలా ఉండగా ఐశ్వర్యారాయ్ ఇటీవల పీఎస్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. తన గ్లామర్ తో హైదరాబాద్ లో మాజీ ప్రపంచ సుందరి మెరుపులు మెరిపించింది. 

 

1010

ఇదిలా ఉండగా ఈ వెండి డ్రెస్ లో ఐశ్వర్యరాయ్ నడచి వస్తుంటే ఆమె అసిస్టెంట్స్ డ్రెస్ ని సరిచేసేందుకు, మోసేందుకు తిప్పలు పడుతున్నారు. 

click me!

Recommended Stories