
ఎపిసోడ్ ప్రారంభంలో పెద్ద వాళ్ళని ఓపెన్ చెయ్ పెళ్లి చేసుకుందాం అంటుంది స్వప్న. మా ఇంట్లో వాళ్ళు బరువుకి ప్రాణం ఇస్తారు అవసరమైతే మనల్ని వదులుకుంటారు కానీ పరువు ప్రతిష్టల్ని వదులుకోరు. మీ చెల్లెలు మా ఇంట్లో ఉన్నంతవరకు మన పెళ్లి జరగనివ్వదు దయచేసి నన్ను మర్చిపో.. నువ్వైనా సుఖంగా ఉండు అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాహుల్.
చెల్లెలి మీద కసితో రగిలిపోతూ ఉంటుంది స్వప్న. అప్పుడే అటుగా వెళుతున్న కావ్య, స్వప్నని చూసి ఆమె దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఎక్కడికి కూడా వచ్చేసావా రాజ్ ని తీసుకు రాలేదా అని నిష్టూరంగా అడుగుతుంది స్వప్న. ఏం మాట్లాడుతున్నావ్ అక్క నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు అంటుంది కావ్య.
నిన్ను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను మా పెళ్లి ని ఆపటానికి నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా పైఎత్తులు వేసి మరీ ఆ ఇంటికి పెద్ద కోడల్ని అవుతాను నీకు అడుగడుగునా అడ్డుపడుతుంటాను ఏం చేస్తావో చూస్తాను అంటూ ఆవేశంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని మొదట అనుమాన పడుతుంది కావ్య.
ఇదంతా రాహుల్ ఎఫెక్ట్ అని తర్వాత అర్థం చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే స్వప్న ఇంట్లో అడుగు పెట్టే సమయానికి తన పెట్టే బేడా బయటికి విసిరేస్తాడు కృష్ణమూర్తి. నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అడగను నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళు అంటే కోపంగా అరుస్తాడు. ఇంట్లో తెచ్చి పెట్టుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు అయినా నీ బుద్ధి మార్చుకోలేదు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అంటూ కనకం కూడా కోప్పడుతుంది.
ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతాను అని కన్నీరు పెట్టుకుంటుంది స్వప్న. స్వప్న వాళ్ళ పెద్దమ్మ పిల్లలు చెడిపోయారు అంటే అది తల్లిదండ్రుల పెంపకంలో లోపం అంటుంది. తప్పంతా దాందే అంటే ఎలా.. ఈ ఒక్కసారి నేను చెప్పిన మాట వినండి తనని లోపలికి రానివ్వండి పని తోటి కోడలికి మరిదికి సర్ది చెప్తుంది. స్వప్న ఇంట్లోంచి వెళ్ళిపోతే తనమీద నిఘా పెట్టడం కుదరదని అప్పు కూడా పెద్దమ్మకి సపోర్ట్ చేస్తుంది.
కాదనలేక ఒప్పుకుంటాడు కృష్ణమూర్తి. మళ్లీ ఇలాంటి తప్పు చేస్తే నువ్వే తనని మెడపట్టి బయటికి గెంటేయాలి అని వదినకి కండిషన్ పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి. లోపలికి వెళ్ళబోతూ గుమ్మం దగ్గర ఉన్న తల్లిని చూసి ఈరోజు నా బ్రతుకు ఇలా అయిందంటే అందుకు కారణం నీ కూతురు కావ్య. ఎప్పటికైనా నేను వెళ్లవలసిన ఇంటికి వెళ్తాను అప్పుడు నీ కూతురు స్థానం ఈ ఇల్లే అంటూ పొగరుగా మాట్లాడుతుంది.
నీకు ఇంకా అహంకారం తగ్గలేదు అంటూ చెంప చెల్లుమనిపిస్తుంది కనకం. ఇది కావ్య మీద అసూయ పెంచుకుంటున్నట్లుగా ఉంది లాభం లేదు ఎలా అయినా వదిలించుకోవాలి అనుకొని వాళ్ళ అక్కకి ఫోన్ చేసి నువ్వు సంబంధం చూశానన్నావు కదా వాళ్ళని తీసుకొని రేపు పెళ్లి చూపులకు రా అని చెప్తుంది. సరే అంటుంది మీనాక్షి. మరోవైపు కావ్య కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.
మాటల్లో తన దగ్గర కనకం ఫోన్ నెంబర్ ఉన్నట్లుగా నోరు జారతాడు కళ్యాణ్. అంతలోనే కావ్య ఇంటికి రావడంతో ఏం జరిగింది అంటూ అపర్ణ రుద్రాణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఆయన ఆకలితో ఉంటారని టిఫిన్ చేసి తీసుకువెళ్లను మావయ్య చిన్న మామయ్య వాళ్ళకి కూడా తినిపించి వచ్చాను అంటుంది కావ్య. అదేదో చెప్పి వెళ్లొచ్చు కదా అంటుంది చిట్టి. ఆ అవకాశం నీ కోడలు తన కోడలికి ఇవ్వలేదు ఫోన్ లాగేసుకుంది కదా అంటుంది రుద్రాణి.
ఇప్పటికే రాకపోకలు ఎక్కువ అయ్యాయి ఇంకా ఫోన్ కూడా ఉంటే రాజకీయాలు కూడా ఎక్కువవుతాయి అంటుంది అపర్ణ. నీ కొడుకు ఆకలి తీర్చింది అందుకైనా తనని ఏమీ అనకు అంటూ కావ్యని లోపలికి వెళ్లి పని చూసుకో అంటుంది చిట్టి. మరోవైపు నిద్రపోకుండా స్వప్న గురించి ఆలోచిస్తూ ఉంటారు కనుక దంపతులు.
తనకి ఎలాగైనా పెళ్లి చేసి పంపించేయాలి అంటాడు కృష్ణమూర్తి. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఎలా అంటుంది కనకం. ఈ దరిద్రం వదిలి పోతే చాలు అవసరం అయితే ఈ ఇంటిని తాకట్టు పెడతాను అంటాడు కృష్ణమూర్తి. కనకం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. పెద్దదాని పెళ్లి కోసం ఈ ఇల్లు తాకట్టు పెట్టాను ఇప్పుడు ఈ విషయం తెలిస్తే స్వప్న తో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తారు అని కంగారు పడుతుంది కనకం.
తరువాయి భాగంలో నా ఫ్రెండు అమెరికా నుంచి వస్తుంది అని ఆనందంగా అత్తగారికి చెప్తుంది అపర్ణ. తన కూతురు వెన్నెలని మన రాహుల్ కి ఇచ్చి పెళ్లి చేద్దామా అంటుంది రుద్రాణి. ఆ మాటలకి కళ్యాణ్, కావ్య కంగారు పడతారు. నాకు ఒక మాట ఇవ్వు అని విషయం చెప్పకుండా కావ్య దగ్గర మాట తీసుకుంటాడు రాజ్. మాట తీసుకున్న తర్వాత మీ అక్క లాంటి మనిషి ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు తను ఇక్కడికి రాకుండా నువ్వే చూసుకోవాలి అంటాడు. ఆ మాటలకి ఇరకాటంలో పడిపోతుంది కావ్య.