విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరగనుందో తెలుసా? ఇండస్ట్రీ కోసం గ్రాండ్ ఈవెంట్ ఎక్కడ?

Published : Jan 01, 2026, 03:19 PM IST

2025 లో ఎంగేజ్మెంట్ చేసుకుని... సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు విజయ్, రష్మిక. మరి వీరిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? 2026 లో ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఒక్కటి కాబోతున్నారా? రష్మికవిజయ్ ల వివాహం జరిగేది ఎక్కడ? 

PREV
14
సోషల్ మీడియా కోడై కూసింది..

టాలీవుడ్ స్టార్స్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారని ఇండస్టరీలో, సోషల్ మీడియావో వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. అప్పుడప్పుడు డేట్ కు వెళ్లి ఇద్దరు కెమెరా కళ్లకు దొరికిపోయిన సంరద్భాలు కూడా ఉన్నాయి. రష్మిక హైదరాబాద్ వస్తే విజయ్ ఇంట్లోనే ఉండటం, వారితో కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకోవడం, ఫారెన్ టూర్లు, ఇలా అందరికి తెలియకుండానే వారు ప్రేమలో ఉన్నట్టు హింట్ ఇచ్చారు. కానీ ఈ ఇద్దరూ కలిసి పబ్లిక్ గా తమ సంబంధం గురించి ఎక్కడా అధికారికంగా మాట్లాడలేదు. రీసెంట్ గా వీరి ఎంగేజ్మెంట్ జరిగినా.. దాని గురించి కూడా ఈ ఇద్దరు తారలు ఎక్కవడా మాట్లాడకపోవడం విశేషం. ఇక తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

24
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఎంగేజ్మెంట్..

విజయ్ రష్మిక ప్రేమ గురించి వార్తలు వైరల్ అవుతున్న క్రమంలోనే.. 2025 అక్టోబర్ నెలలో సింపుల్ గా వీరి ఎంగేజ్ మెంట్ జరిగినట్టు తెలిసింది. కానీ అఫీషియల్ గామాత్రం వీరు ఈ విషయాన్ని ప్రకటించలేదు. ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. చాలా కొద్దిమంది బంధుమిత్రుల మధ్యనే ఈ కార్యక్రమంల జరిగినట్లు సమాచారం. అయితే, ఎంగేజ్ మెంట్ పై ఎలాంటి ప్రకటన చేయని.. విజయ్ , రష్మిక పెళ్లి విషయం అయినా.. అధికారికంగా ప్రకటిస్తారా లేదా అనేది అభిమానుల సందేహం. అటు నెటిజన్లు, అభిమానులు మాత్రం వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

34
విజయ్ - రష్మిక పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?

ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, విజయ్–రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల ప్రకారం, 2026 ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుందని సమాచారం. ఈ పెళ్లిని రాజస్థాన్ లోని ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఈ పెళ్లి తేదీని ఇరు కుటుంబ సభ్యులు ఫైనల్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

44
ఇండస్ట్రీ కోసం గ్రాండ్ ఈవెంట్..?

అయితే ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మంది మాత్రమే అతిథులుగా హాజరవుతారని టాక్. విజయ్, రష్మికకు మొదటి నుంచి బాగా క్లోజ్ గా ఉండేవారు మాత్రమే జై పూర్ లో పెళ్లికి వెళ్తారట. విజయ్ కు, రష్మికకు పాన్ ఇండియా లెవల్లో స్టార్స్ స్నేహితులుగా ఉన్నారు. అందుకే పెళ్లి కార్యక్రమం ప్రైవేట్ గా నిర్వహించి, వివాహం తరువాత హైదరాబాద్ లో వారందరి కోసంగ్రాండ్ గా రిసెప్షన్ ను వారు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ గా వార్తలు మాత్రం బయటకు రాలేదు.. ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ఆధారంగా.. జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఈ నేపథ్యంలో, విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నాల పెళ్లి డేట్ పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories