మళ్లీ బుక్కైన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న, న్యూ ఇయర్ వెకేషన్ కు వెళ్తున్నారా..?

First Published | Dec 24, 2024, 3:34 PM IST

విజయ్ దేవరకొండ -రష్మిక మందన్న మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు సాక్ష్యాలు కూడా దొరకుతున్నాయి. తాజాగా మరోసారి ఈ జంట దొరికిపోయింది..? 
 

ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ సీక్రేట్ గాప్రేమించుకున్నారు.. టైమ్ రాగానే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. అయితే అసలు విషయం తేలాల్సి ఉన్న స్టార్స్ లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నమాత్రం తమమధ్య ఉన్నది ప్రేమ.. లేక స్నేహమా అనేది క్లారిటీ ఇవ్వకుండా.. కన్ ఫ్యూజ్ లో పెడుతున్నారు.

కాని వీరిమధ్య ప్రేమ ఉందని ఆల్ రెడీ అంతా ఫిక్స్ అయ్యి ఉన్నారు. స్నేహమే అయితే.. ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి వెకేషన్లకు తిరగొచ్చు కదా.. అది కాకుండా సీక్రేట్ గా తిరగడం ఎందుకు అని అడుగుతున్నారు నెటిజన్లు. 

 ఒకరి తరువాత ఒకరు న్యూ ఇయర్ వెకేషన్లకు వెళ్ళడం,  ముంబయ్ రెస్టరెంట్లలో  కనిపించడం, మాల్దీవ్స్ కు వెళ్లి వేరు వేరుగా ఫోటోలు పెట్టడం.. ఇలా చాలా విషయాలు సేకరించారు నెటిజన్లు, ఇక వీరి ప్రేమ ఎప్పడుపెళ్లి వరకు వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

అంతే కాదు... సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు ఎదురౌతున్నా.. వీరద్దరు ఈ విషయంలో స్పందించకపోవడం కూడా  రకరకాల అనుమానాలకు దారి తీస్తుంది. ఏదో ఒకటి చెప్పొచ్చుగా బ్రో.. ఎందుకు ఆడియన్స్ కు, ఫ్యాన్స్ కు ఈ కన్ ఫ్యూజన్ అని అడిగేస్తున్నారు. 
 


ఇక రీసెంట్ గా పుష్ప2 సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకుంది రష్మిక మందన్న. దాంతో ఈమె ఇమేజ్ పాన్ ఇండియాలో భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈక్రమంలోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి సినిమా చూసింది రష్మిక. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి కొన్ని ఈవెంట్లలో కూడా సందడి చేస్తోంది.

ఈక్రమంలోనే విజయ్ దేవరకొండతో కలిసి మరోసారి దొరికిపోయింది రష్మికమందన్న. అయితే ఈసారి కూడా ఇద్దరు కలిసి కనిపించలేదు.. తెలివిగా ఒకరి తరువాత ఒకరు కనిపించి అందరికి సవాల్ విసిరారు. 
 

Vijay Deverakonda, Rashmika Mandanna

 తాజాగా మరోసారి ఈ ఇద్దరూ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. సోమవారం రాత్రి రష్మిక ముందుగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి  ఫొటోలకి ఫోజులిచ్చింది. ఆతరువాత  రష్మిక వెళ్లిపోయిన తర్వాత కొద్ది సేపటికి అదే ప్లేస్ కి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు.అలా ఒకేసారి విజయ్, రష్మిక ముంబయి విమానాశ్రయంలో కనిపించడంతో ఈ జోడి మరోసారి వెకేషన్ ఎంజాయ్ చెయ్యడానికి వెళుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే  న్యూ ఇయర్ ఉండడంతో ఈ  సెలబ్రేషన్స్ కోసం ముంబయి వెళ్లినట్టు తెలుస్తుంది. 

మరి ముంబయ్ లోనే ఉంటారా లేక..ఇక్కడి నుంచి న్యూ ఇయర్ కోసం ఫారెన్ చెక్కేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇంత జరుగుతున్నా తాము రిలేషన్ లో ఉన్నామని మాత్రం బయటపెట్టడం లేదు రష్మిక, విజయ్. ఇక రష్మిక మందన్న పుష్ప2 సక్సెస్ ను ఎంజయ్ చేసే మూడ్ లో ఉండగా.. విజయ్ దేవరకొండ మాత్రం ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే  ఈసారి కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు విజయ్. వచ్చే ఏడాది సాలిడ్ సినిమాతో రాబోతున్నాడు. అంతే కాదు పుష్ప3 లో కూడా విజయ్ దేవరకొండ నటిస్తాడని టాక్ ఉంది. మరి అంది ఎంత వరకూ నిజమో చూడాలి.

Latest Videos

click me!