సుకుమార్ సంచలన వ్యాఖ్యలు: సినిమా వదిలేస్తా!

Published : Dec 24, 2024, 01:35 PM IST

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సుకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సినిమా వదిలేస్తానని ఆయన చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వ్యాఖ్యలకు పుష్ప 2 థియేటర్ ఘటన కారణమని భావిస్తున్నారు.

PREV
15
సుకుమార్ సంచలన వ్యాఖ్యలు: సినిమా వదిలేస్తా!
Pushpa 2, Sukumar, allu arjun


 రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం  గేమ్ ఛేంజర్. ప్రముఖ తమిళ దర్శకుడు  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ గా ఉంది. కియారా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ అంజలి కూడా నటిస్తుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు మేకర్స్. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.  ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ వచ్చారు. కాగా ఈ ఈవెంట్ లో సుకుమార్ చేసిన కామెంట్స్ విని అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ సుకుమార్ ఏమన్నారు...అనేది చూద్దాం.
 

25
Pushpa 2, Sukumar, allu arjun


యూఎస్‌లో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌లో సుకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో సినిమాలోని ‘ధోప్’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో, యాంకర్ సుమ దర్శకుడు సుకుమార్ ను..' మీరు ఒకవేళ 'ధోప్' ' (వదిలిపెట్టడం అని అర్థం) అని వదిలేయాలి అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు అని అడిగితే.. సుక్కు ఏకంగా 'సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా' అని చెప్పాడు. 
 

35
Pushpa 2, Sukumar, allu arjun


సుకుమార్ మాటలు  పక్కనే కూర్చున్న రామ్ చరణ్ విని షాకయ్యాడు. అనంతరం సుకుమార్ దగ్గర మైక్ లాక్కొని 'అలా చేయరులే'  అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల మీడియా అంతటా వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్స్..' ప్రెజెంట్ సంధ్య థియేటర్ దగ్గర సంఘటన వల్ల సుకుమార్ బాగా డిస్ట్రబ్ అయ్యి ఇలాంటి కామెంట్ చేసినట్లు ఉన్నారని అంటున్నారు.
 

45
pushpa 2 director Sukumar

 పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందుల్లో పడటం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బన్నీపై పరోక్షంగా విమర్శలు చేయడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది.

రేసెంట్ గా ‘పుష్ప 2’ సక్సెస్ మీట్‌లో, మహిళ మృతి గురించి మాట్లాడుతూ సుకుమార్ తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా సినిమాలు వదిలేస్తా అని అనటంతో ఈ రెంటికి ముడిపెడుతున్నారు  సోషల్ మీడియా జనం. 

55


ఇప్పటికే గేమ్ ఛేంజ‌ర్‌ చూసిన పుష్ప 2 డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ మూవీ రివ్యూ చెప్పేశాడు. గేమ్ ఛేంజ‌ర్ ఫ‌స్ట్ హాఫ్ అద్భుత‌మ‌ని, ఇంట‌ర్వెల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ పేర్కొన్నాడు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, ఫినామినల్ అని సుకుమార్ అన్నాడు.

చిరంజీవితో క‌లిసి గేమ్ ఛేంజ‌ర్ మూవీ చూశాన‌ని, జెంటిల్‌మెన్‌, భారతీయుడు చిత్రాలను చూసి ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్లీ అంతే ఎంజాయ్ గేమ్ ఛేంజ‌ర్ చూసిన‌ప్పుడు క‌లిగింద‌ని సుకుమార్ అన్నాడు. . రంగస్థలం మూవీతో రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను.

click me!

Recommended Stories