VD 12 చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఉగాది కానుకగా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. అదే విధంగా టైటిల్ ని ఈ నెలలోనే ప్రకటించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఇది క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు. రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ గర్జిస్తూ కనిపిస్తున్నారు.